iDreamPost
android-app
ios-app

వారానికి 36 గంటల పాటు ఉపవాసం చేస్తోన్న రిషి సునాక్.. కారణం?

  • Published Feb 01, 2024 | 1:17 PM Updated Updated Feb 01, 2024 | 1:17 PM

సాధారణంగా ఉపవాసం అంటే ఏ పండగవేళో, పూజలకో చేస్తారు. మరి కొంతమంది ఆరోగ్య ప్రయోజనాల కోసం చేస్తారు. అది కూడా ఒక పూట, ఓ రోజు మొత్తం చేస్తారు. కానీ, బ్రిటన్ కి చెందిన ప్రధాని ఉపావాసం తెలిస్తే షాక్ అవుతారు. ఏకాంగా వారంలో అన్ని గంటలు చేస్తారంటా. అది ఎంతంటే..

సాధారణంగా ఉపవాసం అంటే ఏ పండగవేళో, పూజలకో చేస్తారు. మరి కొంతమంది ఆరోగ్య ప్రయోజనాల కోసం చేస్తారు. అది కూడా ఒక పూట, ఓ రోజు మొత్తం చేస్తారు. కానీ, బ్రిటన్ కి చెందిన ప్రధాని ఉపావాసం తెలిస్తే షాక్ అవుతారు. ఏకాంగా వారంలో అన్ని గంటలు చేస్తారంటా. అది ఎంతంటే..

  • Published Feb 01, 2024 | 1:17 PMUpdated Feb 01, 2024 | 1:17 PM
వారానికి 36 గంటల పాటు ఉపవాసం చేస్తోన్న రిషి సునాక్.. కారణం?

‘ఉపవాసం’. చాలామంది దీనిని పండగ పర్వదినాన, దైవారాధన సమయంలో ఓ దీక్షలా పాటిస్తారు. మరికొంత మంది ఆరోగ్య ప్రయోజనాల కోసం చేస్తారు. ఏదీ ఏమైనా ఇలా ఉపవాసం చేయడం వెనుక ఆధ్యాత్మికమే కాదు.. అంతర్లీనం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. అవును ప్రతిఒక్కరు పూజల కోసం దైవ భక్తితో ఉపవాసం చేయడం కాకుండా.. వారానికి ఒక రోజు ఇలా ఉపవాసం పాటిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే ఇలా వారంలో ఒక రోజు తినకుండా ఉపవాసం ఉంటే.. మన శరీరాన్ని సరైన సమతుల్యం ఉంచడానికి సహాయపడుతుందని అనేక అధ్యయనాల్లో కూడా వెల్లడయ్యింది. ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీస్, సామాన్యులు సైతం ఆరోగ్యం పై  శ్రద్ధతో.. ఇలా ఉపవాసా దీక్ష చేసిన వాళ్లు ఉన్నారు. తాజాగా ఈ జాబీతాలోనే మన యూకే ప్రధాని కూడా ఉన్నారు. ఈయన సూమరు అన్ని గంటలు పాటు ఉపావాస దీక్షచేస్తారని తెలియడంతో అందరూ షాక్ కి గురైయ్యారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

సాధారణంగా ఎవరైనా పండగలకు, ప్రత్యేక రోజుల్లో ఉపవాసం చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఒక పూట, మరికొందరు రోజంతా ఆహారం తీసుకోకుండా ఉంటారు. కానీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నారు. ఈయన ఏకాంగా వారంలో 36 గంటలపాటు ఉపవాసం చేస్తున్నారు. అనగా.. ఉదహరణకు ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి మంగళవారం ఉదయం 5 గంటల వరకు ఎటువంటి ఆహారం తీసుకోరు. కేవలం నీళ్లు, టీ, కాఫీ మాత్రమే తీసుకుంటారు. కాగా, ఈ విషయాన్ని ఇటీవలే బ్రిటన్‌ మీడియా ఐటీవీ-మిడ్ మార్నింగ్ షోలో రిషి సునాక్ వెల్లడించారు. అయితే ఇలా చేయడానికి కారణమేమిటంటే.. రోజువారి జీవనశైలిలో శరీరాన్ని సమతౌల్యంగా ఉంచడంలో భాగంగానే ఈ నియమాన్ని పాటిస్తున్నని ప్రధాని పేర్కొన్నారు.

Fasting for 36 hours a week!

అలాగే మిగతా రోజుల్లో తనకు ఇష్టమైన తీపి పదార్థాలను తీసుకుంటానని తెలిపారు. కాగా, తనకు ఆహారమంటే ఎంతో ఇష్టమని, పదవీ బాధ్యతల దృష్ట్య గతంలో మాదిరిగా వ్యాయామానికి సమయం కేటాయించడం లేదని చెప్పారు. అందుకే వారం ప్రారంభంలో ఇదో చిన్న రీసెట్‌ వంటిదని సునాక్ వివరించారు. అయితే దీనిపై స్పందించిన యూకే సన్నిహితులు.. సోమవారం పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉండటం చాలా గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. ఆ రోజు కూడా ప్రధాని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని వారు తెలిపారు. ఇక వ్యక్తిగత జీవితంలో వృత్తి ఏకాగ్రత, క్రమశిక్షణకు ఇందుకు నిదర్శమని చెప్పినట్లు బ్రిటన్ మీడియా పేర్కొంది.

అయితే ఈ రకంగా ప్రతివారం 36 గంటల పాటు ఉపవాసం ఉండే రిషి సునక్ డైట్ద ప్యాటర్న్ ను మాంక్ ఫాస్ట్ అని పిలుస్తారు. ఇది ఒక రకమైన అడపాదడపా ఉపవాసం అని నిపుణులు అంటున్నారు. దీనితో పాటు ఇలా 36 గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల శరీరంలోని మృత కణాలను బయటకు వెళ్లి, ఆరోగ్యకరమైన కణాల పునరుత్పత్తిని తోడ్పతుంది. అలాగే.. ఇది బరువు నియంత్రణలో ఉంచి రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులను నివారిస్తుంది. మరి, బ్రిటన్ ప్రధాని చేసిన 36 గంటల ఉపవాసా దీక్ష పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.