iDreamPost
android-app
ios-app

unstoppable Prabhas అన్ స్టాపబుల్ షోకి అదిరిపోయే అతిథులు

  • Published Dec 07, 2022 | 1:32 PM Updated Updated Dec 07, 2022 | 1:32 PM
  • Published Dec 07, 2022 | 1:32 PMUpdated Dec 07, 2022 | 1:32 PM
unstoppable Prabhas అన్ స్టాపబుల్ షోకి అదిరిపోయే అతిథులు

సెకండ్ సీజన్ లో పొలిటికల్ ఫ్లేవర్ ఎక్కువైన బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షోకి ఒకేసారి రెట్టింపు హైప్ తెచ్చేందుకు డార్లింగ్ ప్రభాస్ ని తీసుకురాబోతున్నారు. అది కూడా ఒక్కడినే కాదు. తన ప్రాణ స్నేహితుడు గోపి చంద్ తో కలిపి. ఈ మేరకు ఓటిటి వర్గాల్లో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. అతి త్వరలోనే ఈ ఎపిసోడ్ ని షూట్ చేయబోతున్నారు. త్వరలోనే బాలయ్య వీరసింహారెడ్డి చివరి పాట చిత్రీకరణకు విదేశాలకు వెళ్ళబోతున్నారు. ఆలోగా ఇది పూర్తి చేసి క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఆహా ఉంది. అంతకన్నా ముందు సీనియర్ మోస్ట్ హీరోయిన్లు జయసుధ, జయప్రదలతో ఒక ప్రత్యేక ఎపిసోడ్ వచ్చే వారం రానుంది.

ప్రభాస్ రాబోతున్నాడని తెలియగానే ఫ్యాన్స్ లో ఉత్సాహం వచ్చేసింది. ఎందుకంటే డార్లింగ్ ఎక్కువ ఇంటర్వ్యూలు ఇవ్వడు. కేవలం తన రిలీజులు ఉన్నప్పుడు అది కూడా ప్రమోషన్ కోసమే మీడియాతో మాట్లాడుతాడు. అంత సిగ్గరి. అలాంటిది కలివిడిగా సాగే బాలయ్య షోలో ఖచ్చితంగా కొన్ని సీక్రెట్లు చెప్పాల్సి ఉంటుంది. అది పెళ్లి గురించి కావొచ్చు లేదా పెదనాన్న కృష్ణంరాజుగారితో తన అనుబంధం గురించి ఎవరికీ తెలియని విషయాలు కావొచ్చు. ఏవైతేనేం ఓ గంటన్నర పాటు నాన్ స్టాప్ తమ హీరోని అభిమానులు చూసుకోవచ్చు. సలార్ షూట్ లో బిజీగా ఉన్న ప్రభాస్ శ్రీవాస్ డైరెక్షన్ లో నటిస్తున్న గోపిచంద్ ఇద్దరూ అందుబాటులో ఉన్నారు

అన్ స్టాపబుల్ సీజన్ వన్ రేంజ్ లో టూ లేదన్న కామెంట్స్ కు బదులు చెప్పే ప్రయత్నమే ఇదంతా. ఆ మధ్య చిరంజీవి పవన్ కళ్యాణ్ గెస్టులు వస్తారని చెప్పారు కానీ ప్రస్తుతానికి ఆ సూచనలు కనిపించడం లేదు. నిర్మాత అల్లు అరవింద్ తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అందులో కొన్ని కాంబోలు మాత్రమే వర్కౌట్ అవుతున్నాయి. ఆహా సబ్స్క్రైబర్స్ ని పెంచే విషయంలో ఈ ప్రోగ్రాం బాగా ప్లస్ అవ్వడంతో కొన్నేళ్ల పాటు దీన్ని నడిపే ప్లానింగ్ జరుగుతోంది. కాకపోతే వారానికో సెలబ్రిటీని సెట్ చేసుకోవడం పెద్ద టాస్క్ గా మారుతోంది ప్రభాస్ వచ్చాక కొత్త ఊపు వస్తుందనేది మాత్రం నిజం. విశ్వక్ శేష్ లదే ఓ రేంజ్లో పేలితే ఇక ప్రభాస్ గురించి చెప్పాలా?

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobetcratosroyalbetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom