iDreamPost
iDreamPost
ప్రస్తుతం కరోనా దెబ్బకు థియేటర్లు మూతబడి ఖాళీగా ఉన్న సినిమా ప్రేమికులు అభిమానులు భారీ చిత్రాల అప్ డేట్స్ కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. అందులోనూ ప్రభాస్ లాంటి నేషనల్ రేంజ్ హీరో అయితే ఇక చెప్పేదేముంది. ఇప్పుడు ఇదే ప్రభాస్ 20 నిర్మాతలకు ఇబ్బందిగా మారింది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీకి సంబంధించిన టైటిల్ ప్లస్ ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేస్తామని ట్విట్టర్ లో డైరెక్టర్ ఇండియాకు కరోనా రావడానికి చాలా రోజుల ముందే ప్రకటించాడు. అయితే దాని తర్వాత యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు.
ఈలోగా షూటింగ్ కోసం జార్జియా వెళ్ళిన టీం వైరస్ ప్రభావం వల్ల త్వరగా రిటర్న్ వచ్చేసి ఇళ్లకే పరిమితమయ్యింది. కాని ఫేస్ బుక్ లో కాని ట్విట్టర్ లో కాని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సైలెంట్ అయ్యింది. ఇది ఫ్యాన్స్ కి ఆగ్రహం కలిగించింది. యువి బ్యాన్ చేయాలంటూ ట్రెండింగ్ చేయడం మొదలుపెట్టారు. రీ ట్వీట్స్ తో హోరెత్తించారు. దీంతో అధికారికంగా యువి సంస్థ ప్రకటన చేస్తూ ప్రస్తుతం నెలకొన్న దురదృష్ట పరిస్థితుల వల్ల చేస్తున్న పనిని ఆపెశామని దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతూ మెసేజ్ పెట్టారు. గతంలో సాహో విషయంలోనూ యువి బ్యానర్ ఇదే తరహ పోకడ పోయిందని ప్రభాస్ ఫాన్స్ ఫిర్యాదు.
ఇక్కడ వాళ్ళ కోణంలో అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఉంది. ఎప్పుడో వచ్చే సంవత్సరం రిలీజయ్యే ఆర్ఆర్ఆర్ కు ఇప్పటికే ఒక మోషన్ పోస్టర్, చరణ్ ఇంట్రో వీడియో విడుదలయ్యాయి. మరి ఈ ఏడాదే ప్లాన్ చేసిన ప్రభాస్ 20 కనీసం టైటిల్ అనౌన్స్ మెంట్ చేసుకోకపోతే ఎలా అనేదే వాళ్ల వెర్షన్. రెండు వర్గాలు చెబుతున్నది కరెక్టే అయినా ఇప్పుడున్న సిచువేషన్ లో ఎవరినీ తప్పు బట్టలేం. పూజా హెగ్డే హీరొయిన్ గా రూపొందుతున్న ఈ మూవీ యూరోప్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ లవ్ స్టొరీగా డిఫరెంట్ జానర్ లో రూపొందుతోందని టాక్. ఓ డియర్, రాదే శ్యాం టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు ఇప్పటికే ప్రచారంలో ఉంది. అధికారిక ధృవీకరణ కోసం ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పదు .