రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయన్నది నిజమేనా ?

రాజకీయాలు ఎక్కడైనా ఒకటేలాగుంటాయన్నది వాస్తవమే అయినా ఏపిలో మాత్రం డిఫరెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా అధికారంలో నుండి దిగిపోయిన పార్టీ అధికారపార్టీ విషయంలో పగబట్టినట్లుగా వ్యవహరించదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అన్న నానుడి ప్రకారమే రాజకీయ పార్టీలు నడుచుకుంటాయి. కానీ ఏపిలో మాత్రం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మీద కచ్చ కొద్దీ చంద్రబాబునాయుడు రెచ్చిపోతున్నాడు.

ఇక్కడ విచిత్రమేమిటంటే చంద్రబాబుకు మద్దతుగా సిపిఐ, జనసేన, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ఎల్లోమీడియా కూడా జగన్ పై యుద్ధమే ప్రకటించాయి. చంద్రబాబు మెప్పుకోసమే పై పార్టీల నేతలు పనిచేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. పూలన్నింటినీ దారం కలిపినట్లే జగన్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల నేతలందరినీ ఎల్లోమీడియా కలుపుతోంది. అందుకే మెజారిటి మీడియాలో జగన్ వ్యతిరేక వార్తలే ప్రముఖంగా కనిపిస్తుంటుంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు, పవన్ తో పోలిస్తే మిగిలిన నేతలకు ఓ తేడా ఉంది. అదేమిటంటే తెలుగుదేశంపార్టీ చంద్రబాబు సొంతమన్నట్లే జనసేన కూడా పవన్ కల్యాణ్ సొంతం. కానీ సిపిఐ రామకృష్ణ సొంతం కానట్లే, బిజెపి కూడా కన్నా సొంతం కాదు. అధ్యక్షులుగా ఉన్నంత కాలమే వీళ్ళను జనాలు పట్టించుకుంటారు. ఒకసారి ఈ స్ధానం నుండి తప్పుకుంటే వీళ్ళను పట్టించుకునే వాళ్ళే ఉండరన్నది వాస్తవం.

ఇప్పటికే చంద్రబాబు ప్రయోజనాలే ధ్యేయంగా పై నేతలంతా పనిచేస్తున్న విషయం అందరికీ అర్ధమైపోయింది. మరి కన్నా, రామకృష్ణ కీలక స్ధానాల నుండి తప్పుకుంటే పరిస్ధితి ఏమిటి ? ఇక్కడే రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవు అనే నానుడి గుర్తుకొస్తోంది. చంద్రబాబు కోసమని కన్నా, రామకృష్ణలు తమ పార్టీలనే పణంగా పెట్టేశారు. సరే పవన్ కు ఉన్నదేమీ లేదు కాబట్టి కొత్తగా పోయేదేమీ లేదు.

ఇక్కడ వీళ్ళంతా మరచిపోయిందేమంటే రాజకీయంగా చంద్రబాబుకు ప్రస్తుతం దిక్కులేకపోతే ఇక మిగిలిన వాళ్ళనెవరు పట్టించుకుంటారు. అందుకనే అందరూ కలిసి జగన్నే టార్గెట్ చేశారు. జగన్ను టార్గెట్ చేస్తున్నారు కాబట్టే ఈ ప్రచారంలో ఉంటున్నారు. అయితే ఎంతకాలమన్నదే ప్రశ్న ? ఒకవేళ పార్టీల అగ్రనాయకత్వాలు గనుక కన్నా, రామకృష్ణలను కొత్తవాళ్ళను సీన్ లోకి తీసుకొస్తే వీళ్ళ సంగతి గోవిందా ? అదే వాళ్ళు గనుక పద్దతిగా ఉంటే రేపు పదవుల్లో లేకపోయినా మంచినేతలుగా చెలామణి అయ్యే అవకాశాలుండేవి. అలా కాకుండా చంద్రబాబు మద్దతుదారులుగా మారిపోయి వీళ్ళంతా రాజకీయంగా తమ భవిష్యత్తుకు తామే సమాధులు కట్టేసుకున్నారని అనుకుంటున్నారు.

Show comments