iDreamPost
android-app
ios-app

ప్రధాని ప్రసంగం వేళ ఖాళీ కుర్చీ! అసలు సంగతి ఏంటంటే..

ప్రధాని ప్రసంగం వేళ ఖాళీ కుర్చీ! అసలు సంగతి ఏంటంటే..

దేశ రాజధాని ఢిల్లీలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేశారు. అనంతరం దేశాన్ని ఉద్దేశిస్తూ ప్రసగించారు. ఈ వేడుకకు అతిరథులు అందరూ వచ్చారు. వేలాది మంది ప్రేక్షకులు అక్కడ హాజరయ్యారు. విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ప్రధాని ప్రసంగం వేళ.. అక్కడ ఒక ఖాళీ కుర్చీ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత పెద్ద వేడకకు హాజరు కానీ.. ఆ వ్యక్తి ఎవరా? అని మీకు సందేహం వస్తుంది కదా?. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

77వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఇవాళ ఎర్ర‌కోట‌పై జెండా ఎగుర‌వేసిన త‌ర్వాత ప్ర‌ధాని మోదీ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. వేడుకకు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు వ‌చ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే మాత్రం హాజరు కాలేదు. ఆయ‌నకు కేటాయించిన కుర్చీ ఖాళీగా క‌నిపించింది. కానీ ఖ‌ర్గే త‌న ట్విట్ట‌ర్‌లో గొప్ప సందేశాన్ని ఇచ్చారు.  ఆ వీడియోలో ఖర్గే..గ‌త ప్ర‌ధానులు దేశాభివృద్ధి కోసం చేసిన కృషి వెల్ల‌డించారు.

తనకు ఆరోగ్యం స‌రిగా లేని కార‌ణంగా ఈ వేడుక‌ల‌కు హాజ‌రుకాలేద‌ని చెప్పిన ఖ‌ర్గే తెలిపారు. ఇక తన సందేశంలో గాంధీ, నెహ్రూ, వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, నేతాజీ, మౌలానా ఆజాద్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, స‌రోజిని నాయుడు, అంబేద్క‌ర్‌కు నివాళి అర్పించారు. అంతేకాకుండా భాజపా దివంగత నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పేరును ప్రస్తావించారు. ఇంక ఆయన మాట్లాడుతూ..” ప్రతి ప్రధాని దేశ పురోగతికి తమవంతు సహకారాన్ని అందించారు. అభివృద్ధి కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు.

కానీ  కొన్ని ఏళ్లు నుంచి ప్రగతి పథంలో వెళ్తుందని చెప్పేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు  ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థళు ప్రమాదంలో ఉన్నాయని ఎంతో బాధతో చెప్తున్నాను. ప్రతి పక్షాల గొంతు నొక్కేందుకు కొత్త సాధనాలు ఉపయోగిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు సీఈసీ ని కూడా బలహీన పరుస్తున్నారు” అంటూ ప్రస్తుత ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మరి.. మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ