iDreamPost

ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

దేశ వ్యాప్తంగా మంగళవారం ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ ఆఫీసుల్లో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రపంచలోనే భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, జనాభాలో కూడా అగ్రస్థానంలో ఉన్న భారత్.. నేడు ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటోందని అన్నారు. జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం, వైవిద్యం అనే మూడు అంశాలకు ప్రజల కలలను సాకారం చేసే శక్తి ఉందని ఆయన అన్నారు.

మేము అధికారంలోకి వచ్చిన మొదట్లో ఆర్థిక వ్యవస్థలో భారత్ 10వ స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు 5వ స్థానానికి చేరుకుందని ప్రధాని పేర్కొన్నారు. అయితే ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సాంప్రదాయ చేతివృత్తుల వారిని ఆదుకోవడానికి ఓ పథకాన్ని ప్రకటించారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు మెరుగైన జీవితాన్ని కల్పించడానికి ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈ పథకానికి దాదాపు రూ.13 వేల నుంచి 15 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నామని కూడా తెలిపారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఇది కూడా చదవండి: విద్యాశాఖపై సీఎం జగన్‌ కీలక సమీక్ష..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి