లాక్‌డౌన్‌ పాటించకుంటే జైలు శిక్షే – కోర్టు సంచలన తీర్పు

ప్రపంచ దేశాలు కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నవేళ అన్ని దేశాలు ఈ మహమ్మారి నుండి బయట పడి ప్రజలను రక్షించుకునేందుకు అనేక చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా భారత దేశ ప్రధాని నరెంద్రమోడి దేశం మొత్తం ఏప్రిల్ 11 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా వైరస్ ఒకరినుండి మరొకరికి వేగంగా సంక్రమించి ప్రాణాలను సైతం హరించే శక్తి ఉండటంతో దేశంలో ఉన్న ప్రజలు ఎక్కడ వారు అక్కడే ఉండాలని , ఎవరు కూడా ఇల్లు వదిలి బయటికి రాకూడదని, అత్యవసర పరిస్థితుల్లో సరైన కారణాలు ఉంటేనే ఇంటినుండి ఒక్కరే బయటకి వచ్చి మూడు కిలోమీటర్ల పరిధి దాటి వెళ్లకుండా పని చూసుకుని వెళ్ళిపోవాలని, అందరు పోలీసులకి సహకరించి దేశాన్ని కాపాడుకునే భాగంలో ముఖ్యపాత్ర పోషించాలని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వై.యస్ జగన్ ప్రజలు ఇళ్ళు వదిలి రావద్దు అని అనేక విజ్ఞప్తి చేశారు.

అయితే రాష్ట్రంలో కొంతమంది ఇప్పటికి సామాజిక బాధ్యతతో వ్యవహరించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తు రోడ్లపైకి రావడం , పోలీసు ఆంక్షలని పట్టింకోకపొవడం, కుంటిసాకులు చెబుతు రోడ్లపై తిరగడం లాంటివి చేస్తూనే ఉన్నారు. ఇటువంటు వారిపై పొలీసులు కూడా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు పాటించని వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై లాఠిలు జులిపిస్తున్నారు. వాగ్వివాదానికి దిగినవారిపై 1897 ఎపిడిమిక్ యాక్ట్ కింద కేసులు పెడుతున్నారు. ఇది ఇలా ఉంటే నిబంధనలు అతిక్రమించిన వారిపై కోర్టులు కుడా తీవ్రంగానే స్పందిస్తున్నాయి. పోలీసుల వారు నమోదు చెసిన కేసుల ఆధారంగా తాజాగా చిత్తూరు జిల్లా పీలేరు కోర్టు 13 మందికి 2 రోజులు జైలు శిక్ష ఒక్కకరికి 1000 రూపాయల జరిమానా విధిస్తు తీర్పునిచ్చింది. విరంతా ఈ నేల 23వ తారీకున నిబంధనలు ఉల్లంఘించిన వారే అవడం గమనార్హం

Show comments