iDreamPost
android-app
ios-app

వినియోగదారులకు పెట్రో షాక్- వరుసగా11 వ రోజు పెరిగిన ధరలు

వినియోగదారులకు పెట్రో షాక్- వరుసగా11 వ రోజు పెరిగిన ధరలు

కరోనా కారణంగా పాతాళానికి పడిపోయిన పెట్రోల్ ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని తాకుతున్నాయి. వ‌ర‌స‌గా 11వ రోజు కూడా దేశంలో ఇంధన ధరలు పెరిగాయి. బుధవారం లీటరు పెట్రోల్ ధర హైదరాబాద్ లో 57 పైసలు పెరుగుదలతో రూ.80.22కు చేరుకుంది. డీజిల్ ధర 58 పైసలు పెరిగి రూ.74.07కు వెళ్లింది. రాబోయే కొద్ది రోజుల్లో ఇంధన రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.

విజయవాడలో కూడా పెట్రోల్ ధర 56 పైసలు పెరుగుదలతో రూ.80.27కు చేరింది. డీజిల్ ధర కూడా 56 పైసలు పెరుగుదలతో రూ.74.17కు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ఇంధన వినియోగం తగ్గడంతో ముడి చమురు ధరలు పాతాళానికి దిగజారిన విషయం తెలిసిందే. దాంతో ముడి చమురును ఉత్పత్తి చేసే దేశాలు, కంపెనీలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. కాగా లాక్ డౌన్ సడలింపుల తర్వాత ముడి చమురు ధరలు పుంజుకున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు అనుకూలంగా దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. కాగ భవిష్యత్తులో పెట్రోల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనా ఇలా రోజూ పెరుగుతున్న పెట్రోల్ ధరలు వినియోగదారులకు షాక్ ఇస్తున్నట్లు చెప్పవచ్చు.