Idream media
Idream media
“”తెలుగు వారి ప్రతిష్ఠ దిగజారింది.. నవ్యాంధ్ర నవ్వుల పాలైంది”.. అంటూ కొద్ది రోజుల క్రితం చంద్రబాబు.., “విధ్వంసానికి ఒక్క చాన్స్” అంటూ తాజాగా లోకేష్ బాబు.. జగన్ ఏడాది పాలనపై బురద జల్లే ప్రయత్నం చేశారు. ఉన్నవి, లేనివి కల్పించి కట్టుకథలు అల్లారు. ఏడాదికే.. పోవాలి జగన్.. అని ప్రజలు అంటున్నారంటూ అసత్య ప్రచారాలు చేశారు. ఏ నాయకుడి పనితీరుకైనా అసలైన కొలమానం ప్రజాదరణ. దాన్ని బట్టే ఆ నాయకుడు ఎంత వరకు సక్సెస్ అయ్యాడని తెలుస్తుంది.
అంతేకానీ.. ప్రతిపక్షాల అసత్యాలు… ఆరోపణలు ఎవరి స్థాయినీ తగ్గించలేవు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విషయంలో అదే జరుగుతోంది. జగన్ ప్రతిష్ఠను దిగజార్చాలని చంద్రబాబు అండ్ కో ఎంత ప్రయత్నిస్తున్నా.. వాళ్లకు ఎదురు దెబ్బే తగులుతోంది. ఇప్పుడు ఏడాది పాలనపై చార్జిషీట్ విడుదల చేసిన లోకేష్ జగన్.. ప్రజాదరణ కోల్పోయారని ఆరోపించారు.
కానీ.. ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వే వివరాలను పరిశీలిస్తే.. చంద్రబాబు అండ్ కోకు దిమ్మ తిరగక తప్పదు. సాధారణంగా ఏ పార్టీకైనా అధికారం చేపట్టిన తొలి ఏడాదిలో అంతగా గుర్తింపు దక్కదు. అన్ని శాఖలపైనా అవగాహన పెంచుకుని పాలనను గాడిన పెట్టేందుకు సమయం సరిపోతుంది. అందువల్ల మొదటి ఏడాదిలో పెద్దగా ఏమీ చేయలేరు.
కానీ.. జగన్ అలా కాకుండా ముఖ్యమంత్రిగా ఎన్నికైన మరు క్షణం నుంచే గత పాలకుల కాలంలో గతి తప్పిన పాలనను గాడిన పెట్టేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే అధికారులతో సమీక్షలు జరిపారు. సంక్షేమ పథకాల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చక చకా దృష్టి సారించి అమలు దిశగా కృషి ప్రారంభించారు. సమీక్షలతో సమస్యలు తెలుసుకున్నారు. పరిష్కారం దిశగా అడుగులు వేశారు. ఫలితంగా ఏడాదిలోనే 3,57,51,612 మందికి లబ్ది చేకూర్చారు. రూ.40,139 కోట్లు వారి సంక్షేమానికి ఖర్చు చేశారు. అందు వల్లే జగన్ ఏడాది పాలనకు అత్యధిక మంది ప్రజలు ఓట్లేశారు.
ఓ ప్రైవేట్ న్యూస్ సంస్థ నిర్వహించిన సర్వేలో 5 లక్షల 50 వేల మంది పాల్గొనగా.. 3, 04, 574 మంది జగన్ పాలన భేష్ అన్నారు. అంటే సుమారు 56 శాతానికి పైగా ప్రజలు జగన్ పాలన బాగుందని కితాబు ఇచ్చారు. తొలి ఏడాది లోనే ఈ తరహా ఆదరణ అందరికీ సాధ్యం కాదు. అంతే కాకుండా ఆయా సంక్షేమ పథకాల అమలుపై సర్వేలో కొందరు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఉదాహరణకు ఇంగ్లీషు మీడియం అమలుకు జగన్ చేస్తున్న కృషిపై ఇలా.. Visionary cm.. He knows the value of english medium.. Education is excellant gift to childrens. It is every parant desire. In future these kids can achive so many things. We respect CM jagan planes. Excellent governance. అభివర్ణించారు. సూపర్, ఎక్సలెంట్, గుడ్… అంటూ ఎందరో జగన్ పాలనకు పట్ఠం కట్టారు.
అలాగే సీ ఓటర్ దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో మోస్ట్ పాపులర్ సీఎంల జాబితాలో నాలుగో స్థానం సాధించి టాప్ 5లో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో పాటు జగన్ పాలనపై ఎన్టీవీ నిర్వహించిన సర్వేలోనూ.. ప్రజల్లో ఆయనకున్న అభిమానం చెక్కు చెదర లేదని తేలింది. ఈ సర్వేల ఫలితాలను బట్టి టీడీపీ చార్జీషీట్ ను ప్రజలు చీకొట్టినట్లు స్పష్టం అవుతోంది.