iDreamPost
android-app
ios-app

Pelli SandaD : వంద రోజులు దాటినా డిజిటల్ రాలేదే

  • Published Jan 23, 2022 | 1:27 PM Updated Updated Jan 23, 2022 | 1:27 PM
Pelli SandaD : వంద రోజులు దాటినా డిజిటల్ రాలేదే

ఇప్పుడు థియేటర్ కు డిజిటిల్ కు మధ్య గ్యాప్ ఏ స్థాయిలో తగ్గిపోయిందో కళ్లారా చూస్తున్నాంగా. ఇటీవలే వచ్చిన పుష్ప పార్ట్ 1 ఇంకా థియేటర్లలో ఆడుతుండగానే ఇరవై రోజుల తర్వాత జనం ఇళ్లలోనే ఎంజాయ్ చేశారు. మొన్న స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అఖండ ఊచకోతకు సోషల్ మీడియానే సాక్ష్యం. శ్యామ్ సింగ రాయ్ కూడా బాగానే వెళ్తోంది. కానీ ఎప్పుడో మూడు నెలల క్రితం రిలీజైన సినిమా ఇప్పటిదాకా డిజిటల్ లో రాకపోవడం అంటే విచిత్రమేగా. రాఘవేంద్రరావు నటుడిగా పరిచయమవుతూ రోషన్ శ్రీకాంత్ హీరోగా రూపొందిన పెళ్ళిసందడి మొన్నే వంద రోజులు పూర్తి చేసుకుంది. అయినా ఓటిటిలో రాకపోవడం పెద్ద ట్విస్ట్.

అదేంటో హండ్రెడ్ డేస్ ఎక్కడ ఆడిందనుకుంటున్నారా. షిఫ్టింగ్ మీద థియేటర్లు మారుతూ వైజాగ్ లో శ్రీకాంతి అనే హాలులో వంద రోజుల పోస్టర్ వేసుకుంది. నిజానికి ఇది బ్లాక్ బస్టర్ కాదు. కీరవాణి పాటలు, శ్రీలీల గ్లామర్, విజువలైజేషన్, పండగ అడ్వాంటేజ్ ఇవన్నీ కలిసి జనం బాగానే థియేటర్లో చూసేలా చేశాయి. అలా అని దీన్ని ఎవరూ మెచ్చుకోలేదు. రొటీన్ స్టఫ్ తో విసిగించేశారని అన్నవాళ్ళే ఎక్కువ. అయినా కూడా డబ్బులు వచ్చాయి. నిర్మాతతో పాటు పంపిణీదారులు గట్టెక్కేశారు. ఇంత జరిగినా కూడా పెళ్లి సందడి డిజిటల్ లోకి రాలేకపోవడం వింతే. ఇంకా సినిమా చూడని వెయిటింగ్ లిస్టు గట్టిగానే ఉందని ట్విట్టర్ చూస్తే అర్థమైపోతుంది.

దీనికి కారణం ప్రొడ్యూసర్ చెప్పిన అధిక దరనే కారణమంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. హాట్ స్టార్ కొనేసిందని గతంలో వార్తలు వచ్చాయి కానీ స్ట్రీమింగ్ చేసే సూచనలు మాత్రం కనిపించడం లేదు. భారీ మొత్తాన్ని ఆశించడం కరెక్ట్ కాదు కానీ అదెంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ఈ పెళ్లి సందడి ఫలితం కాసేపు పక్కనపెడితే రోషన్ మాత్రం పెద్ద బ్యానర్లలో బుక్కైపోతున్నాడు. సితార, మైత్రిలతో ఆల్రెడీ డీల్ అయ్యింది. గీత ఆర్ట్స్ కూడా లైన్ లో ఉంది. ఇవి కాకుండా కథలు పట్టుకుని వస్తున్న దర్శక నిర్మాతలు కూడా గట్టిగానే ఉన్నారు. సినిమా ఫ్లాప్ అయినా అందరూ సేఫ్ అయిన చిత్రం ఈ మధ్యకాలంలో ఇదొక్కటే

Also Read : KGF Chapter 2 : రాఖీ భాయ్ సినిమాకు ఎన్ని చిక్కులో