iDreamPost
android-app
ios-app

పవన్ కళ్యాణ్ ర్యాలీ సుగాలి ప్రీతి కి న్యాయం చేసేందుకేనా ..?

  • Published Feb 12, 2020 | 8:48 AM Updated Updated Feb 12, 2020 | 8:48 AM
  • Published Feb 12, 2020 | 8:48 AMUpdated Feb 12, 2020 | 8:48 AM
పవన్ కళ్యాణ్ ర్యాలీ సుగాలి ప్రీతి కి న్యాయం చేసేందుకేనా ..?

సుగాలీ ప్రీతి దుర్ఘటన జరిగింది ఎప్పుడు ?. తమరు స్పందిస్తున్నది ఎప్పుడు ?. కారకులు ఎవరు ?.

వెనకుండి రక్షించింది ఎవరు ?. మీరు ప్రశ్నించాల్సింది ఎవర్నీ ?. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాల్సింది ఎవర్నీ ?.

ప్రజా సేవ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించడానికి ప్రధాన కారణం ఆయనలో లోపించిన చిత్తశుద్ధి , విశ్వసనీయత . ఎన్నికల తర్వాత కూడా తానేమీ మారలేదని పవన్‌ కళ్యాణ్‌ మరో సారి రుజువు చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో 2017లో అత్యాచారం, హత్యకు గురైన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని “ర్యాలీ ఫర్‌ జస్టిస్‌” పేరుతో కర్నూలు రాజ్‌ విహార్‌ కూడలి నుంచి కోట్ల కూడలి వరకు ఈ రోజు బుధవారం (ఫిబ్రవరి –12) ర్యాలీ నిర్వహించ తలపెట్టారు.

కిరాతక వ్యక్తుల దుర్మార్గానికి బలయ్యిన ఓ ఆడపిల్లకు న్యాయం చేయాలని, దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం నిజంగా అభినందనీయమే. కానీ ఈ దుర్ఘటన 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో టీడీపీ నేత వి.జనార్థన్‌ రెడ్డి కుమారులే నిందితులు. అప్పట్లో వారిని అరెస్ట్‌ చేసినా కేసు బలం లేకుండా పెట్టడం వలన కేవలం 23 రోజులకే బెయిల్‌ పై విడుదలయ్యారు . ఘటన జరిగిన సమయంలో పవన్‌ కళ్యాణ్‌ టీడీపీతో పొత్తులో ఉన్నారు.

అప్పుడు సుగాలి ప్రీతి అత్యాచారం, హత్యపై గానీ , ముద్దాయిల పై గానీ , వారి వెనక అండగా ఉన్న టీడీపీ నేతల పై గానీ వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడని పవన్‌ కళ్యాణ్‌.. ఘటన జరిగిన ఇన్నేళ్ల తర్వాత మాట్లాడడాన్ని గమనిస్తే సుగాలీ ప్రీతి లాంటి బాధితుల పట్ల ఆయన చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది .

ఇప్పటికే ఈ కేసును తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ సీబీఐకి అప్పగించింది. కేసుకు సంబంధించిన వివరాలను కేంద్రహోంశాఖకు ఇప్పటికే పంపించింది.

ఘటన.. పూర్వా పరాలు..

కర్నూలు లక్ష్మీ గార్డెన్ లో నివాసం ఉంటున్న సుగాలి రాజు నాయక్, పద్మావతిల కుమార్తె 14ఏళ్ళ సుగాలి ప్రీతి. తెలుగుదేశం నేత అయిన వి.జనార్ధన రెడ్డికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ లో 10వ తరగతి చదివేది, 2017 ఆగస్టు 19న ఫ్యాన్ కి ఉరి వేసుకుని కనిపించింది. స్కూల్ యాజమాన్యం ఆత్మహత్య అని చెప్పగా.. స్కూల్ అధినేత కొడుకులు హర్ష వర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డిలు అత్యాచారం చేసి చంపారని ప్రీతి తల్లిదండ్రులు ఆరోపించారు.

కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసిన డాక్టర్ శంకర్ గారు ఆగస్టు 20న ఇచ్చిన ప్రాథమిక రిపోర్టులో బాలికపై అత్యచారం జరిగిందని ధ్రువీకరించారు . పాథాలజి హెచ్.ఒ.డి డాక్టర్ బాలేశ్వరి గారు ఆగస్టు 21న ఇచ్చిన రిపోర్టులో కూడా అత్యాచారం జరిగిందని తేల్చిచెప్పారు.దీంతో ప్రీతి తల్లితండ్రులు కాలేజీ యాజమాన్యం పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. నిందితులపై పోలీసులు పోక్సో సెక్షన్ 302, 201, యస్.సి, యస్.టి చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన పై విచారణకు కలక్టర్ ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేశారు. ఈ కమిటీ కూడా విద్యార్ధినిపై లైంగిక దాడి చేసి హత్య చేశారని రిపోర్టు ఇచ్చింది.

సాక్ష్యాలు ఇలా పక్కాగా ఉన్నా అరెస్టు అయిన నిందితులకి 23 రోజులకే బెయిల్ వచ్చింది. నిందితులకి తెలుగుదేశం నేత , మాజీ పోలీస్ ఆఫీసర్ , నంద్యాల లోక్ సభ అభ్యర్థి మాండ్ర శివానంద రెడ్డి అండగా నిలబడి అడుగడుగునా కేసుని నీరుకార్చే ప్రయత్నం చేశారని, నిందితులని తన ఇంట్లో పెట్టుకుని కాపాడారనే ఆరోపణలు ఉన్నాయి. కేసుని నీరు కార్చేందుకు తెలుగుదేశం నేతలు తీవ్ర ప్రయత్నాలు చేయడంతో సుగాలి ప్రీతి తల్లి దండ్రులు జాతీయ మానవహక్కుల కమీషన్ ను ఆశ్రయించారు. కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేసును సి.ఐ.డి దర్యాప్తు కి అప్పగించింది. అయినా దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతూ వచ్చింది. రాజకీయ నేతల ఒత్తిళ్ళతోనే కేసులో ఇంత జాప్యం జరుగుతోందని.. కేసుని సి.బి.ఐ కి అప్పగించాలని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కోర్టుని ఆశ్రయించారు. 2017 ఆగస్టు 18 రాత్రి స్కూల్ యాజమాని కొడుకులు అక్కడ మద్యంతో విందు చేసుకున్నారని పలు నివేదికలలో పేర్కొన్న అంశాన్ని కూడా కోర్టు దృష్టికి ప్రీతి తల్లిదండ్రులు తీసుకుని వచ్చారు.

2017 లో అత్యాచారం, హత్య చేయబడ్డ సుగాలి ప్రీతి కేసుని అప్పటి టీడీపీ ప్రభుత్వం అడుగడుగునా నీరు కార్చి నిందితులైన తమ పార్టీ నేతలని , వారి కొడుకుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే , వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే కర్నూల్ వెళ్ళిన మహిళా హోంమంత్రి సుచరిత.. సుగాలి ప్రీతి కేసుని తిరిగి విచారణ చేపడతామని హామీ ఇచ్చి గత ఏడాది ఏఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో తిరిగి విచారణ ప్రారభించారు. ఎంక్వైరీ రిపోర్టు వచ్చిన వెంటనే చర్యలు తీసుకొంటామని నాడు హోంమంత్రి హామీ ఇచ్చారు .

ఐతే సుగాలి ప్రీతి తల్లిదండ్రులు సీబీఐ విచారణకు విజ్ఞప్తి చేయగా.. ఆ మేరకు జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఘటన పూర్వాపరాలు ఇలా ఉండగా దుర్ఘటన జరిగిన నాటి నుండీ టీడీపీ ప్రభుత్వం దిగిపోయే వరకూ ఏ దశలోనూ సుగాలీ ప్రీతి కి మద్దతుగా గానీ , టీడీపీ పార్టీకి చెందిన నిందితులకు వ్యతిరేకంగా గానీ ఒక్క మాట మాట్లాడని అప్పటి టీడీపీ పొత్తుదారుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పించడంలో నైతికత ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు .

టీడీపీ ప్రభుత్వహాయంలో ఘటనజరిగిన తర్వాత రెండున్నరేళ్లకు పవన్‌ కళ్యాన్‌కు సుగాలి ప్రీతి గుర్తుకు రావడం విశేషం. ఇటీవల తెలంగాణలో జరిగిన దిశ ఘటన తర్వాత ఒకసారి సుగాలి ప్రీతి ఘటనను పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తావించారు. ఇప్పుడు ఈ కేసు విచారణ సీబీఐకి వెళ్లిన తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు . సరే సమస్య పై ఎవరు పోరాడినా మంచిదే ?

ఇప్పటికైనా పవన్ కల్యాణ్ గారు ఈ సమస్యని రాజకీయ లబ్దికి వాడుకోకుండా , ప్రభుత్వంపై పై బురద జల్లడానికి అవకాశంగా తీసుకోకుండా చిత్తశుద్ధితో పోరాడతారా ? .

అత్యాచారం , హత్య ఘటనలో నిందితులు హర్షవర్ధన్ రెడ్డి , దివాకర్ రెడ్డి ల పేర్లు ప్రస్తావించి వారిని కఠినంగా శిక్షించమని డిమాండ్ చేస్తారా ?.

ఆడపిల్లలు చదువుకొనే స్కూల్ లో మందు పార్టీలు నిర్వహించి దుర్ఘటనకు కారణమైన నిందితుల తండ్రి పై , ఘటనకు వేదికైన స్కూల్ పై చర్యలు తీసుకొమ్మని కోరతారా ?.

నిందితులకు ఆశ్రయమిచ్చి కేసు నీరుగార్చడానికి సహకరించిన టీడీపీ నేత,మొన్నటి ఎన్నికల్లో నంద్యాల ఎంపీ అభ్యర్థి మండ్ర శివానంద రెడ్డి ని కూడా విచారించాలని పోరాడతారా ? .

ఈ ఘటనలన్నింటికీ మౌన సాక్షీ భూతంగా ఉండి బాధితురాలికి ఏ సాయమూ చేయని అప్పటి ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబు గారిని కూడా సహా దోషిగా పేర్కొని ప్రశ్నిస్తారా ? .

ప్రస్తుతం సీబీఐ ఆధీనంలో ఉన్న కేసుని త్వరగా విచారించి నిందితుల్ని శిక్షించమని సీబీఐని ఆదేశించమని ప్రస్తుత పవన్ పొత్తు పార్టీ బీజేపీ నేత , కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా ని కలిసి వినతి పత్రం ఇస్తారా ?.

లేక యధావిధిగా సుగాలీ ప్రీతిని కాపాడలేని 151 మంది ఎమ్మెల్యేలు ఎందుకు ? . అత్యాచారం నిందితులకు బెత్తం దెబ్బలు శిక్షగా విధించాలి లాంటి పైత్యం పలుకులతో ర్యాలీ ముగిస్తారో వేచిచూడాలి .

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş