iDreamPost
android-app
ios-app

థియేటర్ గ్యాప్ ని తగ్గించుకుంటున్న డిజిటల్

  • Published Oct 06, 2021 | 7:18 AM Updated Updated Oct 06, 2021 | 7:18 AM
థియేటర్ గ్యాప్ ని తగ్గించుకుంటున్న డిజిటల్

రానురాను థియేటర్ కు ఓటిటికి మధ్య దూరం ఇంకా తగ్గిపోయేలా కనిపిస్తోంది. రెండింటి రిలీజ్ మధ్య నిడివిని మరింత దగ్గర చేసే క్రమంలో ఒప్పందాలు చేసుకునే టైంలోనే దానికి సంబంధించిన టైం ఫ్రేమ్ ని సెట్ చేసుకుంటున్నారు. ఉదాహరణకు నెట్ ఫ్లిక్స్ తీసుకుంటే ఉప్పెన రిలీజైన 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్ జరిగింది. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద గ్యాప్. తిమ్మరుసు కూడా నెల తర్వాతే వచ్చింది. అలా అని ఇదేమి బ్లాక్ బస్టర్ కూడా కాదు. మరోవైపు ప్రైమ్, హాట్ స్టార్ లు డైరెక్ట్ ఓటిటి రిలీజులతో పాటు హాళ్లలో ఆడేసిన సినిమాల ప్రీమియర్లను వీలైనంత త్వరగా ప్లాన్ చేసుకుంటున్నాయి. ప్రేక్షకుడిని ఊరించేలా వీటిని సెట్ చేస్తున్నారు.

ఓన్లీ లోకల్ ట్యాగ్ తో వచ్చిన ఆహా కూడా 20 నుంచి 30 రోజుల లోపే కొత్త సినిమాలను తన యాప్ లో పెట్టేస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, విరాట పర్వం హక్కులను కొన్న నెట్ ఫ్లిక్స్ వాటిని తన రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా తక్కువ గ్యాప్ తో వేసేందుకు నిర్మాతలతో చర్చిస్తోందని సమాచారం. ఎలాగూ సెకండ్ లాక్ డౌన్ తర్వాత ఫస్ట్ వీక్ తప్ప మిగిలిన రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఏమంత జోష్ కనిపించడం లేదు. లవ్ స్టోరీ రేంజ్ టాక్ వస్తే రెండు మూడు వీకెండ్స్ మంచి క్రౌడ్స్ రాబడుతున్నాయి. కానీ ఫ్లాప్ లేదా యావరేజ్ టాక్ వచ్చిన సినిమాల పరిస్థితి అలా లేదు. వారానికే థియేటర్ నుంచి మాయమైతే స్మార్ట్ స్క్రీన్ కు రావడానికి మాత్రం చాలా టైం పడుతోంది

అందుకే కామధేనువుగా మారిన కరోనా అవకాశాన్ని ఓటిటిలు ఓ రేంజ్ లో వాడుకుంటున్నాయి. తెలుగులో తక్కువే కానీ తమిళ మలయాళంలో వీటి దూకుడు భారీగా ఉంది. డైరెక్ట్ ప్రీమియర్లు కంటిన్యూ గా వస్తూనే ఉన్నాయి. మోహన్ లాల్, సూర్య లాంటి అగ్ర హీరోలు నిర్మాతలు లాభపడాలనే ఉద్దేశంతో ఎంత క్రేజ్ ఉన్నా తమ సినిమాలను నేరుగా ఓటిటికి ఇస్తుంటే నో చెప్పడం లేదు. ముందు ముందు టాలీవుడ్ లోనూ ఇలాంటి ట్రెండ్ వచ్చినా ఆశ్చర్యం లేదు. సో ఇకపై ప్రేక్షకులు ఏ సినిమా అయినా బిగ్ స్క్రీన్ మీద ఎక్స్ పీరియన్స్ చేయాలా లేక చిన్నదైనా పర్లేదా అని ముందే ఆలోచించుకుని దానికి తగ్గట్టే ప్లాన్ చేసుకుంటారు

Also Read : ఉర్రూతలూగిస్తున్న స్క్విడ్ గేమ్