iDreamPost
iDreamPost
కొత్త శుక్రవారానికి థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కానీ ఓటిటిలో మాత్రం రేపు బ్రహ్మాండమైన ఆప్షన్స్ ఉన్నాయి. కోరుకున్న వాళ్లకు కోరుకున్నంత అనే స్థాయిలో మూవీస్, వెబ్ సిరీస్ గట్టిగానే సందడి చేయబోతున్నాయి. ముందుగా చెప్పుకోవాల్సిన వాటిలో ‘శ్యామ్ సింగ రాయ్’ ఇవాళ అర్ధరాత్రి నుంచే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో రానుంది. హోమ్ ఆడియన్స్ గట్టిగానే ఉన్నారు కాబట్టి వ్యూస్ భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మోస్ట్ వాంటెడ్ రిలీజ్ అఫ్ ది సీజన్ ‘అఖండ’ రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి అందుబాటులోకి రానుంది. డిస్నీ హాట్ స్టార్ ప్రతిష్టాత్మకంగా దీన్ని విడుదల చేస్తోంది. అందరి ఇళ్లలో షోలు పడటం ఖాయం.
జీ5లో ‘లూసర్’ వెబ్ సిరీస్ రెండో సీజన్ ని రేపటి నుంచే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. పది ఎపిసోడ్లతో రూపొందిన మొదటి భాగానికి మంచి ఆదరణ దక్కడంతో అదే క్యాస్టింగ్ తో కొనసాగింపు చేస్తున్నారు. ప్రమోషనల్ ఈవెంట్లు గట్టిగా చేశారు. ఆహాలో మలయాళం డబ్బింగ్ మూవీ ‘హే జూడ్’ని ఫ్రైడే ప్రీమియర్ గా ఇస్తున్నారు. మన ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్న తమిళ చిత్రం ‘బ్యాచిలర్’ సోనీ లివ్ ద్వారా వస్తోంది. దీనికి తెలుగు ఆడియో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఓజార్క్(ఇంగ్లీష్), 36 ఫార్మ్ హౌస్(హిందీ), భూతకాలం (మలయాళం), ఆన్ పాస్డ్ 2(హిందీ), ది గిఫ్ట్, మునిచ్, ఏ హీరో, మై ఫాదర్స్ విలన్ తదితరాలు కూడా రేపే పలకరిస్తాయి.
ఈ లెక్కన చేతిలో టైం ఉండాలే కానీ గంటల తరబడి ఎంటర్ టైన్మెంట్ జనానికి సిద్ధంగా ఉంది. కాకపోతే వీటికి సబ్క్రిప్షన్స్ ఉంటేనే చూసేందుకు సాధ్యమవుతుంది. అయితే రకరకాల మార్గాల్లో వస్తున్న పైరసీ వల్ల చందాలు కట్టకుండానే కొత్త సినిమాలు ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు కోట్లలోనే ఉన్నారు. ఇది అరికట్టడం అయ్యే పని కాదు కాబట్టి డిజిటిల్ సంస్థలు కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నాయి. థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకుని స్టార్ హీరోల సినిమాలు రిలీజవ్వడానికి ఇంకా టైం పట్టే అవకాశం ఉండటంతో అప్పటిదాకా ఓటిటి మీదే ఎక్కువ ఆధారపడక తప్పేలా లేదు. మళ్ళీ కరోనా ఎఫెక్ట్ ఆ స్థాయిలో ఉంది మరి
Also Read : RC15 : మెగా మూవీలో కొత్త ఆకర్షణలు