iDreamPost
android-app
ios-app

అటజని కాంచె పద్యాన్ని తడబడకుండా చెప్పిన అర్హ.. బాలయ్య ఫిదా..

  • Published Nov 19, 2024 | 1:38 PM Updated Updated Nov 19, 2024 | 1:38 PM

Allu Arha: అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ అన్ స్టాపబుల్ షోలో తెలుగు పద్యంతో అదరగొట్టింది. తడబడకుండా పద్యం చెప్పి అందరి చేత శభాష్ అనిపించుకుంది. అర్హ పద్యానికి బాలయ్య ఫిదా అయిపోయారు.

Allu Arha: అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ అన్ స్టాపబుల్ షోలో తెలుగు పద్యంతో అదరగొట్టింది. తడబడకుండా పద్యం చెప్పి అందరి చేత శభాష్ అనిపించుకుంది. అర్హ పద్యానికి బాలయ్య ఫిదా అయిపోయారు.

  • Published Nov 19, 2024 | 1:38 PMUpdated Nov 19, 2024 | 1:38 PM
అటజని కాంచె పద్యాన్ని తడబడకుండా చెప్పిన అర్హ.. బాలయ్య ఫిదా..

టాలీవుడ్ సెలబ్రిటీ షో ఆహా అన్ స్టాపబుల్ బుల్లితెరపై దూసుకెళ్తున్నది. నందమూరి నట సింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 4 ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ షోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్న విషయం తెలిసిందే. తాజాగా బన్నీ ఆహా అన్‌స్టాప‌బుల్ ఎపిసోడ్ పార్ట్ 2 ప్రోమో తాజాగా రిలీజ్ చేసారు. ఈ ఎపిసోడ్ కు అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ వచ్చి సందడి చేసారు. దీంతో ఈ ప్రోమో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ప్రోమోకి ఇంత హైప్ రావడానికి గల కారణం బన్నీ గారాలపట్టి అర్హ చెప్పిన తెలుగు పద్యమే. కఠినమైన పద్యాన్ని తడబడకుండా చెప్పి బాలయ్యతో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.

అర్హ చెప్పిన తెలుగు పద్యానికి బాలయ్య ఫిదా అయిపోయారు. అర్హను దగ్గరికి తీసుకుని అభినందించారు. తండ్రికి తగ్గ తనయ అర్హ అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు పలువురు కామెంట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కిడ్స్ పాల్గొన్న ఈ షో ఆధ్యాంతం ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ప్రోమోలో చూసినట్లైతే.. అర్హ, అయాన్ షోలోకి ఎంట్రీ ఇవ్వగానే వెళ్లి బాలయ్య కాళ్లకు నమస్కరించారు. గాడ్ ఆఫ్ మాసెస్ ఆ పిల్లలిద్దరికి ఆశీస్సులు అందించారు. ఆ తర్వాత బాలకృష్ణ వీళ్లకు తెలుగు వచ్చా అని అడగడంతో అల్లు అర్హ.. పదో తరగతిలోని ప్రవరుని స్వగతం పాఠ్యాంశంలోని అటజని కాంచె పద్యం చెప్పి బాలయ్యతో సహా షోలో అందర్నీ ఆశ్చర్యపరిచింది.‘అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ..’ని అర్హ మంచి నీళ్లు తాగినంత ఈజీగా స్పష్టంగా చెప్పేసింది.

దీంతో అందరూ అర్హని మెచ్చుకుంటున్నారు. బాలయ్య అర్హ తెలుగుని చూసి ఫిదా అయిపోయారు. పెద్ద వాళ్లు సైతం అటజని కాంచె పద్యం చెప్పడానికి తడబడుతుంటారు. అలాంటిది సెకండ్ క్లాస్ చదువుతున్న అర్హ అది కూడా తెలుగుకు ఆదరణ తగ్గుతున్న తరుణంలో ఈ పద్యాన్ని చెప్పి తెలుగు గొప్పతనాన్ని మరోసారి చాటిచెప్పింది. ఈ జనరేషన్ లో పిల్లలు తెలుగు రాయడానికి, చదవడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది అర్హ అనర్గళంగా పద్యం చెప్పి అలరించింది. అర్హ అలా తెలుగులో పద్యం చెప్పడం చూసి.. తెలుగు చల్లగా నాలుగు కాలాల పాటు హాయిగా ఈ భూమి మీద బతికి ఉంటుందనిపిస్తుంది అని బాలయ్య అన్నారు.

ఇక బన్నీ ఫ్యాన్స్, నెటిజన్లు అర్హ పద్యం చెప్పిన వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. కాగా అర్హ చిన్నప్పటి నుంచే చురుగ్గా ఉంటూ ముద్దు ముద్దు మాటలతో కట్టిపడేసిన విషయం తెలిసిందే. తెలుగులో స్పష్టంగా మాట్లాడుతూ ఆకట్టుకుంది. బన్నీ గతంలో తన కూతురుతో సరదాగా చేసిన వీడియోలు నెట్టింటా వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల రిలీజైన ట్రైలర్ మిలియన్స్ వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నది. మరి అన్ స్టాపబుల్ షోలో అర్హ తడబడకుండా పద్యం చెప్పిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio