iDreamPost
android-app
ios-app

అందు కోసమే వైన్ షాపుకు వెళ్లాను.. వీడియోపై క్లారిటీ ఇచ్చిన బన్నీ!

  • Published Nov 15, 2024 | 5:54 PM Updated Updated Nov 15, 2024 | 5:54 PM

Allu Arjun: నందమూరి బాలకృష్ణ హూస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో 'అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే. ఇప్పటి వరకు ఈ షోలో ఎంతోమంది హీరోలు, పొలిటీషియన్స్ సందడి చేశారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Allu Arjun: నందమూరి బాలకృష్ణ హూస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో 'అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే. ఇప్పటి వరకు ఈ షోలో ఎంతోమంది హీరోలు, పొలిటీషియన్స్ సందడి చేశారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Published Nov 15, 2024 | 5:54 PMUpdated Nov 15, 2024 | 5:54 PM
అందు కోసమే వైన్ షాపుకు వెళ్లాను.. వీడియోపై క్లారిటీ ఇచ్చిన బన్నీ!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ పుష్ప 2: ది రూల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం పుష్ప 2 ప్రమోషన్లు మొదలయ్యాయి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హూస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే’. ఈ షోకి ఎంతోమంది స్టార్ హీరోలు ఇతర రంగాలకు చెందిన వారు వచ్చి సందడి చేశారు. ఈ టాక్ షో ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటి వరకు మూడు సీజన్లు విజయవంతంగా ముగించుకొని.. నాలుగో సీజన్ లోకి అడుగు పెట్టారు. బాలయ్య తన స్టైల్, వాక్చాతుర్యంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. అందుకే  ఆహా సబ్‌స్క్రైబర్లు, వ్యూయర్‌షిప్ భారీ సంఖ్య భారీగా పెరిగాయి అనడంలో అతిశయోక్తి లేదు.

ప్రస్తుతం  ‘అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే’ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశాడు.  బాలయ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఆటపట్టిస్తూ.. అల్లరి చేస్తూ ఆడియన్స్ ని బాగా ఎంటర్‌టైన్ చేశారు. ఈ టాక్ షోలో సందడి చేసిన బన్నీ తన లైఫ్, కెరీర్ గురించి అనేక విషయాలు పంచుకున్నారు.  గతంలో అల్లు అర్జున్ ఒక వైన్ షాప్ కి వెళ్లి మందు కొంటున్న వీడియో వైరల్ అయ్యింది. ఇది పాత వీడియో అయినప్పటికీ ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇదే విషయాన్ని బాలకృష్ణ.. బన్నీతో ప్రస్తావించాడు. తాను వైన్ షాపుకు వెళ్లిన విషయంపై బన్నీ క్లారిటీ ఇచ్చాడు. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు..అతని పేరు సందీప్ రామినేని. విజయవాడకు చెందిన సందీప్ మీకు హార్డ్ కోర్ అభిమాని.. వాడిని కోస్తే ఎల్లో బ్లడ్ వస్తుంది అంటూ ఆసక్తకర వ్యాఖ్యలు చేశాడు బన్నీ.

నాపేరు సూర్య షూటింగ్ కోసం గోవా వెళ్లాం. అప్పుడే సందీప్ గోవా వచ్చిన విషయం నాకు చెప్పాడు. అలాగే తనకు ఏ బ్రాండ్ కావాలో అడిగాడు. నేను వైన్ షాప్ వద్దకు వెళ్లి డ్రైవర్ ని పంపించాను. కానీ అతడికి భాష సరిగా రాకపోవడంతో నేను సెలబ్రెటీ అన్న విషయం మర్చిపోయి డైరెక్ట్ వైన్ షాపుకు వెళ్లి ఆ బ్రాండ్ అడిగాను. నేను అడిగిన బ్రాండ్ అక్కడ లేకపోవడంతో ఏమీ కొనకుండానే వెనక్కి వచ్చేశాను. అది కాస్త సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యింది.ఇంకేముంది అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని అన్నారు. ఆ తర్వాత స్టేజ్ మీదకు సందీప్ ని పిలిచాడు బాలయ్య. తన ప్రాణ స్నేహితుడిని సడెన్ గా చూడగానే సంతోషంతో పొంగిపోయాడు.. అతన్ని హగ్ చేసుకున్నాడు. వీడు నా బెస్ట్ ఫ్రెండ్.. అతను లేకుంటే నేను లేను అని అన్నాడు. ఈ వీడియోకి సంబంధించిన క్లిప్లింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ షోలో నందమూరి బాలకృష్ణతో అల్లు అర్జున్ రాపో ఎంతో ఫ్రీగా ఉందో అన్నదాని గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet