Swetha
హర్రర్ సినిమాలంటే అందరికి ఇష్టమే.. అలాగే సైకలాజికల్ థ్రిల్లర్స్ అన్నా కూడా అందరు ఇంట్రెస్ట్ గానే చూస్తూ ఉంటారు. మరి ఈ రెండు కలిపిన కథను ఎప్పుడైనా చూశారా.. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా అలాంటిదే.
హర్రర్ సినిమాలంటే అందరికి ఇష్టమే.. అలాగే సైకలాజికల్ థ్రిల్లర్స్ అన్నా కూడా అందరు ఇంట్రెస్ట్ గానే చూస్తూ ఉంటారు. మరి ఈ రెండు కలిపిన కథను ఎప్పుడైనా చూశారా.. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా అలాంటిదే.
Swetha
ఇప్పుడు ఓటీటీ లకు వచ్చే సినిమాలన్నీ కూడా థియేటర్ లో రిలీజ్ అయినవే. ఎక్కడో కొన్ని సినిమాలు మాత్రం డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల అవుతూ ఉంటాయి. ఇక సినిమాలు ఎప్పుడు వచ్చినా కానీ.. ప్రేక్షకులు వాటిని ఆదరిస్తూనే ఉన్నారు. ఇక తెలుగు వారు ఎక్కువగా ఆదరించే సినిమాలలో మలయాళీ సినిమాలు ముందుంటాయి. ముఖ్యంగా ఓటీటీ ఆ పుణ్యమా అని కొన్నేళ్లుగా మలయాళ సినిమాలు తమ సత్తా ఏంటో చూపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ లో ఉండే కొన్ని బెస్ట్ మూవీస్ ను ఆల్రెడీ చూసేసి ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సినిమా గురించే. హర్రర్ సినిమాలంటే అందరికి ఇష్టమే.. అలాగే సైకలాజికల్ థ్రిల్లర్స్ అన్నా కూడా అందరు ఇంట్రెస్ట్ గానే చూస్తూ ఉంటారు. మరి ఈ రెండు కలిపిన కథను ఎప్పుడైనా చూసారో లేదో ఓ లుక్ వేసేయండి.
సిటీకి దూరంగా అడవి మధ్యలో ఓ పెద్ద భవంతి ఉంటుంది. దాని చుట్టూ 500 ఎకరాల పొలాలు ఉంటాయి. ఆ బిల్డింగ్ లో బెంజమిన్ అనే ఓ డాక్టర్ మానసిక సమస్యలతో బాధపడే పేషంట్స్ కు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వ్యవస్థ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఉంటాడు. అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలు ఎవరికీ తెలియవు. అయితే అక్కడ ఎదో జరగకూడనిది జరుగుతుంది అనే ఉద్దేశంతో. అక్కడ గవర్నమెంట్ కిషోర్ నందా అనే ఓ డాక్టర్ ను అక్కడకు పంపిస్తుంది. అతను అక్కడికి రాగానే.. అందరికి భయం మొదలవుతుంది. ఈ క్రమంలో అక్కడ తీవ్రమైన మానసిక బాధ పడుతూ ఒంటరిగా ఒక గదిలో బందీ అయిన నిత్య అనే అమ్మాయిని చూస్తాడు. ఆమెను అలా బంధించడం వెనుక చాలానే కథ దాగి ఉందని తెలుసుకుంటాడు. ఆ కథేంటి ? అసలు అక్కడ ఏం జరుగుతుంది ? నిత్యను బయటకు తీసుకుని రాగలిగాడా లేదా ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
ఈ సినిమా కథ వింటే దాదాపు అందరికి ఈ సినిమా పేరు గుర్తొచ్చే ఉంటుంది. ఈ సినిమా మరేదో కాదు.. సాయిపల్లవి, ఫాహద్ ఫాజిల్, కులకర్ణి, రెంజి, పనికర్-ప్రకాష్ రాజ్ నటించిన మలయాళ మూవీ ‘అతిరన్’. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం “అనుకోని అతిధి” పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రస్తుతం ఆహ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒకవేళ ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైన మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.