Swetha
ఈ వారం ఓటీటీ లో ఎలాగూ కొన్ని మాత్రమే చూడదగినవి ఉన్నాయ్ కాబట్టి.. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను కూడా ఈ లిస్ట్ లో యాడ్ చేసేసుకోండి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. అనే విషయాలను చూసేద్దాం.
ఈ వారం ఓటీటీ లో ఎలాగూ కొన్ని మాత్రమే చూడదగినవి ఉన్నాయ్ కాబట్టి.. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను కూడా ఈ లిస్ట్ లో యాడ్ చేసేసుకోండి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. అనే విషయాలను చూసేద్దాం.
Swetha
ఎప్పటికప్పుడు ఏ సినిమాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి అనే అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. దానిని బట్టి ప్రేక్షకులు కూడా వీకెండ్ కు ఏ ఏ సినిమాలను చూడాలని ముందు నుంచే ప్లాన్ చేస్తూ ఉంటున్నారు. ఇక ఆ సినిమాలు ఏ మాత్రం బోర్ అనిపించినా కూడా ఓటీటీ లో ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయేమో అని సెర్చ్ చేసే పనిలో ఉంటున్నారు. మరి ఈ వారం ఓటీటీ లో చూడదగిన సినిమాలు ఎలాగూ కొన్ని మాత్రమే ఉన్నాయి కాబట్టి.. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను కూడా ఈ లిస్ట్ లో యాడ్ చేసేసుకోండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. మీరు ఈ సినిమాను చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.
ఇప్పటివరకు భూమి మీద ఉండే ఏ మనిషైనా సరే.. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్లాలని దేవుడిని కోరుకుంటూ ఉండడం చూసి ఉంటాం. కానీ ఈ సినిమా మాత్రం కాస్త డిఫ్ఫరెంట్. ఈ సినిమాలో ఓరాలి , నాథన్ అనే ఇద్దరు అక్కా తమ్ముళ్లు ఉంటారు. తమ్ పెట్ డాగ్ చనిపోడంతో.. నాథన్ చాలా డిప్రెషన్ లో ఉంటాడు. అంతే కాకుండా అతనికి కలలో మేక తల ఉన్న ఓ రాక్షసి విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని గిరిజనులు దేవుడిలా భావిస్తారు. కానీ మిగిలిన వారికి మాత్రం అది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. నాథన్ కు కలలో ఆ విగ్రహం కనపడగానే ఉలిక్కిపడి లేస్తాడు. దీనితో తమ్ముడి కష్టం చూడలేక.. తన పెట్ ను ఎలాగైనా నరకం నుంచి తీసుకుని వస్తానని తమ్ముడికి మాటిస్తుంది ఓరాలి. ఆ నెక్స్ట్ డే నరకానికి ఎలా వెళ్లాలో చెప్పే ఓ బుక్ ని తీసుకుని.. ఆ ఇద్దరు ఓ అడవిలోకి వెళ్తారు. ఆ అడవిలో ఓ చెట్టుపైన ‘ ఈ అడవిలోకి వచ్చినవాళ్లు తిరిగి వెళ్లలేరు’ అని రాసి ఉంటుంది. అయినా పట్టించుకోకుండా వాళ్లిదరు అడవిలోకి వెళ్తారు.
అక్కడ వారిద్దరూ నరకానికి వెళ్లేందుకు పూజలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నాథన్ , ఆరాలి ఓ గొయ్యిని తవ్వడం మొదలు పెడతారు. సరిగ్గా అప్పుడే నాథన్ కు ఓ నల్లని ఆకారం కనిపిస్తుంది. ఆ ఆకారాన్ని చూసి నాథన్ భయపడతాడు, ఓరాలి మాత్రం ఆ దెయ్యాలు ఉన్నాయని నమ్మదు. దినోతో తమ్ముడికి దైర్యం చెప్తుంది. ఈ క్రమంలో నాథన్ కు మూడు తలలు ఉన్న ఓ కుక్క కథ చెప్తుంది. సరిగ్గా అదే రోజు రాత్రి నాథన్ కు మళ్ళీ కల వస్తుంది. అందులో మళ్ళీ మేక తల ఉన్న ఓ రాక్షసి విగ్రహం కనిపిస్తుంది. కానీ ఈసారి ఆ నరరూప రాక్షసులు.. వారిద్దరిని బంధిస్తారు. ఆ తర్వాత ఎం జరిగింది ! కలలో కనిపించిన ఆ నరరూప రాక్షసులు నిజంగానే ఉన్నారా! ఆ అక్కా తమ్ములిద్దరూ నిజంగానే వెతుక్కుంటూ నరకానికి వెళ్ళారా ! పెట్ డాగ్ కోసం ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ! ఇవన్నీ తెలియాలంటే “ఆంట్రమ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా యాపిల్ టీవీ ప్లస్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.