iDreamPost
android-app
ios-app

ప్రతిపక్షంలో అదే కొరవడుతోంది..!

  • Published May 10, 2020 | 3:59 PM Updated Updated May 10, 2020 | 3:59 PM
ప్రతిపక్షంలో అదే కొరవడుతోంది..!

పెద్దోడు ఒకడు పరమాన్నం వండితే తెల్లారే వరకు చల్లారిపోలేదట. కొంచెం ముతక సామెత అయిన సందర్భం వచ్చింది కాబట్టి వాడాల్సి వచ్చింది. ఎందుకు ఇంత పచ్చి గా చెప్పాలి వస్తుందంటే.. నేను అయితే అలా చేసే వాడిని.. ఐఏఎస్ లకేమి తెలుసు.. లాంటి మాటలు మాట్లాడుతుంటే ఇంతకంటే గట్టిగానే చెప్పాలనిపిస్తోంది. కానీ వయసుకు ఇవ్వాల్సిన గౌరవం అడ్డొస్తోంది. ఏ పని చేసినా, కనీసం ప్రారంభించినా అరకొరే కదా. అరకొర లోనూ ఏదో పరమార్థం, బంధు ప్రయోజనం ఉండకుండా ఉండదు. ఇస్తానన్న వాళ్లకి ఇయ్యలేదు. చేస్తాను అన్న వాళ్లకు చేయలేదు. చెప్పినవన్నీ మర్చిపోయారు.

ఇలా అధికారం ఉన్న ఐదేళ్లు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించి ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. ఆ దెబ్బతో వాళ్లు కొట్టిన 151 పంచులకు పక్కన కూర్చున్నారు. అదే పక్క రాష్ట్రంలో లెండి. అక్కడి నుంచి ఆన్లైన్ సూక్తులు వల్లే వేస్తున్నారు. చనిపోయిన వాళ్లకు పరిహారం ప్రకటిస్తే ఆయన అండ్ కో తప్ప అందరూ నోరెళ్లబెట్టారు. ఆ తర్వాత తమాయించుకుని శభాష్ అంటున్నారు. కానీ ఆ 40 ఏళ్ల అనుభవానికి మాత్రం మెచ్చుకోదగ్గ మనసు రాలేదు. ఇంకా పైపెచ్చు స్థానిక ఎమ్మెల్యే ప్రాతినిధ్యమే లేకుండా ప్రత్యేక కమిటీ వేసి తామేదో చేస్తున్నట్లుగా సాంబ్రాణి పొగ వేయడం ప్రారంభించారు. ఈ కమిటీ చేసేది ఏంటయ్యా అంటే సమాధానం వెతుక్కోవాల్సిందే. ఎందుకంటే గతంలో అమరావతిలో రాజధాని ఏర్పాటు కోసం రాజమౌళి ని పిలిపించినట్లే ఉంటుందనేది అందరి అభిప్రాయం.

అటు కరోనా విషయంలో గానీ ఇటు విశాఖ గ్యాస్ ఘటనలో గాని ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న వాళ్ళు.. కిందిస్థాయి కార్యకర్తలు, నాయకులతో కనీసం ఫోన్ లో అన్నా మాట్లాడే ధైర్యం చెబుతున్నారా..? ఏం చేయాలి. ఏం చేయకూడదు. ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి. అధికార యంత్రాంగానికి ఏ విధంగా సహకరించాలి. ఇటువంటి సూచనలు చేస్తే ఉన్నఫలంగా ఏర్పడే ప్రమాదం నుంచి ముందు వారికి మానసిక స్థైర్యం లభిస్తుంది. ఆ తర్వాత జరిగిన ఘటనలో తప్పులు వెతుక్కుని.. తీరిగ్గా ప్రభుత్వం మీదకు దండయాత్ర ప్రారంభించవచ్చు.

కానీ అటువంటిదేమీ లేకుండానే దాడికి దిగడం చూస్తుంటే ప్రతిపక్షాలు గందరగోళంగా ఉన్నాయి అన్నది స్పష్టమవుతోంది. ఎందుకంటే బాధితులు అడిగి చాన్స్ ఇవ్వకుండానే ప్రభుత్వం అన్ని వారికి సమకూర్చిన పెట్టేందుకు సిద్ధపడడం నిజంగా ప్రతిపక్షాలకు ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే ఇక్కడ ఒప్పుకునేందుకు హుందాతనం ఉండాలి. అదే కొరవడుతోంది.