Published Mar 26, 2020 | 5:10 AM ⚊
Updated Mar 26, 2020 | 5:10 AM
|
Follow Us
సినిమా వార్తలు
కోవిడ్ వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిత్యవసర వస్తువుల వాహనాలు, వైద్యానికి సంబంధించిన వాహనాలు మినహా ఏవీ రోడ్లపైకి రావడం లేదు. రోడ్లు, రైల్వే, విమాన మార్గాలన్నీ మూసి వేశారు. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అన్ని టోల్ గేట్లలోనూ తాత్కాలికంగా టోల్ వసూలును నిలిపివేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు. మెడికల్ ఎమర్జెన్సీ వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేగంగా గమ్య స్థానానికి చేరుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం విలువైనదే. కొన్ని క్షణాల వ్యవదే విలువైన ప్రాణాలను కాపాడటానికి ఆధారం. టోల్ గేట్ల వద్ద టోల్ కోసం ఆపుతుండటమ్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు.
దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై 556 టోల్ గేట్స్ ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు టోల్ వసూలు ఆపేయడం జరుగుతూ ఉంటుంది. అయితే దేశ వ్యాప్తంగా ఆపేయడం తక్కువ సందర్బాల్లోనే జరిగింది. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో టోల్ ఏజెన్సీలకు కోట్లలో నష్టం ఉంటుంది. దాన్ని కేంద్రం భరించే అవకాశం ఉంది.