Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యవహార శైలిని చూసి విశ్వసనీయతే విస్తుపోతోంది. జగన్ తీరును చూసి తికమకపడుతోంది. ఓ రాజకీయ నాయకుడు ఇలా కూడా ఉంటాడా..? అన్న సందేహం వెలిబుచ్చుతోంది. హామీలు ఇచ్చి అధికారం చేజిక్కించుకున్నాక.. ఆపై హామీల నుంచి తప్పించుకు తిరిగే నేతలనే ఇప్పటి వరకు స్వతంత్ర భారతం చూసింది. దేశాన్ని ఏలై ప్రధాని అయినా.. రాష్ట్రాలను ఏలే ముఖ్యమంత్రులైనా ఇప్పటి వరకూ వైఎస్ జగన్‌లా.. చేసి ఉండరని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఇంతకీ జగన్ ఏమి చేశారంటే.. ఈ నెల 30వ తేదీతో వైసీపీ పాలన ప్రారంభమై ఏడాది పూర్తవుతుంది. గత ఏడాది మే 23న ఎన్నికల ఫలితాల్లో అఖండ విజయం అందుకున్న వైసీపీ అధినేత.. అదే నెల 30వ తేదీన విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఎన్నికల మెనిఫెస్టోను.. భగవద్గీత, ఖురాన్, బైబిల్ లా భావించి అందులో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని, ఇచ్చిన హామీని నెరవేరుస్తానమి చెప్పారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ, పార్టీ, ప్రభుత్వ వెబ్‌సైట్లలోనూ మెనిఫెస్టోను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
చెప్పిన మాట ప్రకారం తొలి ఏడాదిలోనే మెజారిటీ హామీలు అమలు చేశారు. మిగతా వాటిపై కసరత్తు చేసి అమలుకు ప్రణాళికలు రచించారు. మన పాలన – మీ సూచన అనే కార్యక్రమంతో ఈ రోజు సోమవారం నుంచి పలు అంశాలపై ప్రభుత్వం సదస్సులు నిర్వహిస్తోంది. 30వ తేదీన రైతు భరోసా కేంద్రాల ప్రారంభంతో ఇవి ముగుస్తాయి. ఈ నేపథ్యంలో 30వ తేదీన ఏడాది పూర్తయిన సందర్భంగా వైసీపీ ఎన్నికల మెనిఫెస్టోను ప్రతి ఇంటికి పంపిస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఇచ్చిన హామీల్లో ఏమేమి అమలు చేశామో.. ప్రజలే టిక్ పెట్టాలని కోరారు. అందుకే వైఎస్ జగన్ తీరును చూస్తున్న విశ్వసనీయత విస్మయానికి గురవుతోంది.