నితిన్ మాచర్లకు పెద్ద సవాలే

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో కమర్షియల్ యాంగిల్ లో మాస్ ని ఎక్కువగా టార్గెట్ చేసిన సినిమా మాచర్ల నియోజకవర్గం. ఒకపక్క బింబిసార బ్లాక్ బస్టర్ టాక్ తో మొదటి వారం పూర్తయ్యేలోపే బ్రేక్ ఈవెన్ దాటేసి మూడు కోట్ల దాకా లాభాలు వెనకేసుకుంది. సెకండ్ వీక్ కూడా స్ట్రాంగ్ రన్ ఖాయమని అర్థమైపోయింది. చాలా థియేటర్లు అగ్రిమెంట్లను పొడిగించుకున్నాయి. మరోవైపు సీతారామంకు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ దక్కడంతో వీక్ డేస్ లోనూ మంచి వసూళ్లు నమోదవుతున్నాయి. ఇది ఎక్స్ పెక్ట్ చేసిన దానికన్నా పెద్ద సక్సెస్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు మెయిన్ స్క్రీన్లను కంటిన్యూ చేయబోతున్నారు. సో ఈ రెండు అంత సులభంగా కదిలే పరిస్థితి లేదు.

మాచర్ల నియోజకవర్గానికి నిర్మాత కం పంపిణీదారుడు స్వయానా నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డే కాబట్టి రిలీజ్ విషయంలో పెద్ద ఇబ్బందేమీ ఉండదు. అయితే ఒక రోజు ఆలస్యంగా వస్తున్న కార్తికేయ 2, వెనుకనే ఉంటున్న లాల్ సింగ్ చడ్డాలతో పోటీ పడటం అంత సులభం కాదు.వాటిలో ఏది చాలా బాగుందనే టాక్ వచ్చినా కొన్ని చిక్కులు తప్పవు. అయితే మాచర్లకు చాలా బాగుందనే మాట బయటికి వస్తే చాలు ఈ టెన్షన్ ఉండదు. ఎటొచ్చి యావరేజ్ అనిపించుకున్నా లాభముండదు. ట్రైలర్ కు మిలియన్ల వ్యూస్ వచ్చినప్పటికీ కంటెంట్ చూస్తే రొటీన్ గానే అనిపిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టు అసలు సినిమాలో ఏదైనా మ్యాటర్ ఉందేమో చూడాలి.

అసలే ఈ మధ్య హీరోలు వేసే గవర్నమెంట్ ఆఫీసర్ల పాత్రలు అంతగా అచ్చిరావడం లేదు. టక్ జగదీశ్ లో నాని విఆర్ఓగా చేసి నేరుగా ఓటిటిలో వచ్చినా జనానికి నచ్చలేదు. రామారావు ఆన్ డ్యూటీలో రవితేజ అడిషనల్ కలెక్టర్ కం ఎంఆర్ఓగా చేస్తే మరీ దారుణంగా తిప్పి కొట్టారు. అఫ్కోర్స్ వాటిలో కంటెంట్ వీక్ గా ఉండటం ప్రధాన కారణమే కానీ ఇప్పుడు మాత్రం నితిన్ దీంతో సాలిడ్ హిట్ కొట్టాల్సిన అవసరం చాలా ఉంది. చెక్, రంగ్ దే రెండు థియేట్రికల్ రిలీజులు ఫ్లాప్ అయ్యాయి. మాస్ట్రో హాట్ స్టార్ లో వచ్చి సేఫ్ అయ్యింది. భీష్మ తర్వాత వచ్చిన గ్యాప్ ని పూడ్చుకోవాలంటే మాచర్ల పెద్ద స్కేల్ లోనే వసూళ్లు రాబట్టాలి అది కూడా టఫ్ కాంపిటీషన్ లో.

Show comments