iDreamPost
android-app
ios-app

నా ఫ్లాప్ కోసం ఎదురు చూశారు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్!

  • Published Aug 28, 2024 | 9:34 PM Updated Updated Aug 28, 2024 | 9:34 PM

Krithi Shetty, Tollywood: ఫస్ట్ సినిమాతోనే బ్లాక్​బస్టర్ హిట్ కొట్టి ఓవర్​నైట్ స్టార్​డమ్ తెచ్చుకున్న హీరోయిన్ ఆమె. క్రేజీ మూవీస్ చేస్తూ ఆడియెన్స్ హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన కెరీర్ తొలినాళ్లను తలచుకొని ఎమోషనల్ అయింది.

Krithi Shetty, Tollywood: ఫస్ట్ సినిమాతోనే బ్లాక్​బస్టర్ హిట్ కొట్టి ఓవర్​నైట్ స్టార్​డమ్ తెచ్చుకున్న హీరోయిన్ ఆమె. క్రేజీ మూవీస్ చేస్తూ ఆడియెన్స్ హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన కెరీర్ తొలినాళ్లను తలచుకొని ఎమోషనల్ అయింది.

  • Published Aug 28, 2024 | 9:34 PMUpdated Aug 28, 2024 | 9:34 PM
నా ఫ్లాప్ కోసం ఎదురు చూశారు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్!

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్​డమ్ సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. ఎన్నో సినిమాలు చేస్తే గానీ పేరు, గుర్తింపు రావు. కానీ కొందరు మాత్రం ఒకట్రెండు మూవీస్​కే పాపులర్ అయిపోతారు. మరికొందరైతే డెబ్యూ మూవీస్​తోనే స్టార్స్ అయిపోతారు. అలా ఫస్ట్ సినిమాతోనే బ్లాక్​బస్టర్ హిట్ కొట్టి.. ఓవర్​నైట్ స్టార్​డమ్ తెచ్చుకున్న హీరోయిన్ ఆమె. క్రేజీ మూవీస్ చేస్తూ ఆడియెన్స్ హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుందా బ్యూటీ. ఆమె మరెవరో కాదు.. ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి. క్యూట్ లుక్స్​తో యూత్ ఆడియెన్స్​కు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయిందామె. ఆమె నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’ సూపర్​డూపర్ హిట్ అయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ తర్వాత వరుస మూవీస్ చేస్తూ బిజీ అయిపోయింది కృతి. అలాంటిది తన కెరీర్ తొలినాళ్ల గురించి మాట్లాడుతూ ఆమె ఎమోషనల్ అయింది. తనకు ఫ్లాప్ రావాలని వాళ్లు ఎదురు చూశారని తెలిపింది.

‘ఉప్పెన బిగ్ హిట్ అయింది. అయితే కొందరు మాత్రం నాకు ఫ్లాప్ వస్తుందని ఎదురు చూశారు. ఒక సెక్షన్ జనం నాకు ఫ్లాప్ వస్తే వేలెత్తి చూపించాలని అనుకున్నారు. కానీ నేను హిట్స్, ఫ్లాప్స్.. రెండింటినీ ఒకేలా తీసుకున్నా. ఎందుకుంటే నా ఫస్ట్ ఫిల్మ్ సక్సెస్ అయినప్పుడు అందుకు నేను టోటల్ క్రెడిట్ తీసుకోలేదు. అందుకే ఫ్లాప్ వచ్చినప్పుడు కూడా పూర్తి క్రెడిట్ తీసుకోను’ అని కృతిశెట్టి చెప్పుకొచ్చింది. అయితే తన మూవీస్ ఫ్లాప్ కావాలని ఎదురుచూసిన వ్యక్తులు ఎవరో మాత్రం ఆమె రివీల్ చేయలేదు. అదే సమయంలో ఫ్లాప్ సినిమాల వల్ల తాను మరింత మెరుగుపడ్డానని స్పష్టం చేసింది.

kriti shetty interesting comments

కెరీర్​లో ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో తెలుసుకున్నానని చెప్పిన కృతి.. సక్సెస్ కంటే ఫెయిల్యూర్ వల్లే ఎక్కువ విషయాలు నేర్చుకున్నానని తెలిపింది. పరాజయాల వల్ల ఓ నటిగా తాను మరింత బెటర్​ అయ్యానని.. మూవీ ఎందుకు ఆడలేదనే అనాలసిస్ తనకు బాగా పనికొచ్చిందని పేర్కొంది. విమర్శల్ని తట్టుకొని నిలబడేందుకు ఇది హెల్ప్ అయిందని వివరించింది. ఇక, ‘ఉప్పెన’తో సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి.. ఆ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’తో విజయాలు అందుకుంది. చివరగా శర్వానంద్ ‘మనమే’తో ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేసిందామె. ఆమె తర్వాతి సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కృతి ప్రస్తుతం మలయాళంలో ‘అజయంతే రందం మోషనమ్’ అనే చిత్రంలో నటిస్తోంది. తమిళంలో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’, ‘వా వాతియార్’ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş