iDreamPost
android-app
ios-app

Krithi Shetty: అవును నేను రిలేషన్‌లో ఉన్నాను.. ఎవరితో అంటే: కృతిశెట్టి

  • Published Jun 04, 2024 | 2:36 PM Updated Updated Jun 04, 2024 | 2:36 PM

బేబమ్మ కృతి శెట్టి షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. తను రిలేషన్‌లో ఉన్నాను అంటూ సంచలన విషయాలు వెల్లడించింది. ఆ వివరాలు..

బేబమ్మ కృతి శెట్టి షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. తను రిలేషన్‌లో ఉన్నాను అంటూ సంచలన విషయాలు వెల్లడించింది. ఆ వివరాలు..

  • Published Jun 04, 2024 | 2:36 PMUpdated Jun 04, 2024 | 2:36 PM
Krithi Shetty: అవును నేను రిలేషన్‌లో ఉన్నాను.. ఎవరితో అంటే: కృతిశెట్టి

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఒక్కసారిగా అందరి చూపును తన వైపుకు తిప్పుకుంది బేబమ్మ కృతిశెట్టి. అందం, అమాయకమైన రూపంతో అందరిని ఆకట్టుకున్న కృతి శెట్టి.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ.. చాలా బిజీగా ఉంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా.. వరుస సినిమాలు చేస్తూ.. కెరీర్‌లో దూసుకుపోతుంది. ప్రస్తుతం శర్వానంద్‌ సరసన మనమే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీబిజీగా గడుపుతుంది. ఈ క్రమంలో తాజాగా తన పర్సనల్‌ లైఫ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది బేబమ్మ. తాను రిలేషన్‌లో ఉన్నానంటూ బాంబు పేల్చింది ఈ బ్యూటీ.

హీరో శర్వానంద్ కెరీర్‌లో 35వ మూవీగా వస్తోంది మనమే సినిమా. ఈ చిత్రానికి డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లు సినిమా మీద అంచనాలను భారీగా పెంచాయి. ఇక జూన్ 7న థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం మనమే సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉంది కృతి శెట్టి. వరుసపెట్టి టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉంది. ఈ క్రమంలో సినిమా గురించే కాక.. తన పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించిన ఎదురవుతున్న ప్రశ్నలకు సైతం తెలివిగా సమాధానాలిచ్చేస్తున్నది ఈ అందాల బేబమ్మ.

ఇ​క ఇంటర్వ్యూలో భాగంగా ‘మీరు సింగిలా.. రిలేషన్‌షిప్‌లో ఉన్నారా..’ అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది బేబమ్మ. ‘నేను సింగిల్‌ కాదు. రిలేషన్‌లోనే ఉన్నా’ అని సూటిగా సమాధానమిచ్చేసింది. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. వెంటనే ఇంతకు ఎవరితో రిలేషన్‌లో ఉన్నారని అడిగితే.. ‘నా పనితో.. నా పనితో రిలేషన్‌లో ఉన్నా’ అంటూ నవ్వులు పూయించేసింది కృతిశెట్టి. ఇక కాబోయేవాడు ఎలా ఉండాలి అనడిగితే.. ‘మంచివాడు.. నిజాయితీపరుడై ఉండాలి. సాటివారిపై దయ కలిగినవాడై ఉండాలి’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాక ‘నాకు డ్యాన్స్‌ చేయడం ఇష్టం. యాక్షన్‌ సినిమాలు ఇష్టం. హీరోల్లో రామ్‌చరణ్‌ అంటే అభిమానం. కలిసి నటించే అవకాశం వస్తే మిస్‌ చేసుకోను’ అంటూ చెప్పుకొచ్చింది కృతిశెట్టి.

ఇక ఇందులో నా క్యారెక్టర్ పేరు సుభద్ర. ఇప్పటి వరకూ నేను చేసిన క్యారెక్టర్స్‌కి భిన్నంగా ఉంటుంది. ఈ పాత్ర నాకు చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకూ క్యూట్, సాఫ్ట్, బబ్లీ క్యారెక్టర్స్ చేశాను. కానీ, మనమే సినిమాలో సుభద్ర క్యారెక్టర్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. షూటింగ్ సమయంలో డైరెక్టర్ శ్రీరామ్ గారిని నిజంగానే సుభద్ర ఇంత స్ట్రిక్ట్‌గా ఉంటుందా అని చాలా సార్లు అడిగాను. ఆయన విజన్‌ని ఫాలో అయ్యాను అని చెప్పుకొచ్చింది.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş