iDreamPost
android-app
ios-app

నయనతార ప్రొడ్యూసర్ గా కృతి శెట్టి కొత్త సినిమా.. ఫస్ట్ లుక్ రిలీజ్!

  • Published Aug 02, 2024 | 3:12 PM Updated Updated Aug 02, 2024 | 3:12 PM

Krithi Shetty First Look From Love Insurance Company Movie: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి మరో కొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నయతార ప్రొడ్యూసర్ గా ఆమె భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట లుక్ ని రిలీజ్ చేశారు.

Krithi Shetty First Look From Love Insurance Company Movie: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి మరో కొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నయతార ప్రొడ్యూసర్ గా ఆమె భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట లుక్ ని రిలీజ్ చేశారు.

  • Published Aug 02, 2024 | 3:12 PMUpdated Aug 02, 2024 | 3:12 PM
నయనతార ప్రొడ్యూసర్ గా కృతి శెట్టి కొత్త సినిమా.. ఫస్ట్ లుక్ రిలీజ్!

కృతి శెట్టి.. టాలీవుడ్ లో ఈ అమ్మడుకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. చేసింది తక్కువ సినిమాలే అయినా కల్ట్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుంది. తెలుగులో ఉప్పెన అనే తొలి సినిమాతోనే ఎంతో మందికి అభిమాన హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు వచ్చాయి. అయితే కొన్ని మాత్రం ఆశించిన ఫలితాలను దక్కించుకోలేక పోయాయి. ఇప్పుడు ఈ అమ్మడు తమిళ్ ఇండస్ట్రీలో కాస్త బిజీగానే గడుపుతోంది. చేతినిండా సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా ఈ అమ్మడు చేస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీని నయనతార నిర్మిస్తుండగా.. ఆమె భర్త విఘ్నేష్ శివన్ రచయిత- దర్శకుడిగా ఉన్నాడు.

కృతి శెట్టి టాలీవుడ్ లో ఆచి తూచి ప్రాజెక్ట్స్ ఎంచుకుంటోంది. ఈ ఏడాది మనమే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇప్పుడు మాత్రం మలయాళం, తమిళ్ ఇండస్ట్రీల్లో బిజీగా మారిపోయింది. మలయాళం ఒక సినిమా.. తమిళ్ లో మూడు సినిమాలు చేస్తోంది. అందులో విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ మూవీలో లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ప్రదీప్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన టీమ్.. ఇప్పుడు కృతి శెట్టి ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. ఈ లుక్స్ లో కృతి శెట్టి ఎంతో క్యూట్ గా రెండు జడలతో ఒక యానిమేషన్ బొమ్మలా కనిపిస్తోంది.

ఈ లుక్స్ లో కృతి శెట్టిని చూసిన తర్వాత మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి అనే చెప్పాలి. ఇంక కృతి శెట్టిని పరిచయం చేస్తూ విఘ్నేష్ శివన్ బాగానే పొగడ్తలతో ముంచెత్తాడు. అందం- టాలెంట్ కలిగిన ఒక స్వీట్ బకెట్ లాంటి ఈ అమ్మాయిని మా చిత్రంలోకి తీసుకోవడం సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి స్వాగతం అంటూ ఫస్ట్ లుక్ ని షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. విఘ్నేష్ శివన్, ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి పేర్లు విన్న తర్వాత ఈ ప్రాజెక్టుపై చాలానే అంచనాలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ కు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అనిరుధ్ అంటే మినిమం ఉంటుంది కాబట్టి. మరి.. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రంలో కృతి శెట్టి ఫస్ట్ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Krithi Shetty (@krithi.shetty_official)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş