iDreamPost
android-app
ios-app

హీరోయిన్‌ని సినిమా నుంచి తీసేయించింది నేనే..ఎందుకంటే..?

ఉప్పెన మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి. మైఖేల్, సైరా నరసింహ రెడ్డి వంటి చిత్రాల్లో నటించాడు. అయితే ఇప్పుడు ఓ తప్పును అంగీకరించి.. అభిమానులతో ప్రశంసలు పొందుతున్నాడు.

ఉప్పెన మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి. మైఖేల్, సైరా నరసింహ రెడ్డి వంటి చిత్రాల్లో నటించాడు. అయితే ఇప్పుడు ఓ తప్పును అంగీకరించి.. అభిమానులతో ప్రశంసలు పొందుతున్నాడు.

హీరోయిన్‌ని సినిమా నుంచి తీసేయించింది నేనే..ఎందుకంటే..?

కోలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఎదిగిన వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి. ఎప్పుడో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయ్.. దాదాపు ఏడెనిమిది సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్లలో మెరిశాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా పుంజుకుని.. కోలీవుడ్ స్టార్ హీరోగా మారాడు. ఇటు హిందీ, అటు తమిళ పరిశ్రమను చుట్టేస్తున్నాడు. మధ్య మధ్యలో టాలీవుడ్‌పై కూడా ఓ కన్నేసి ఉంచుతున్నాడు. విలన్‌గా కూడా రాణిస్తున్నాడు. ఇప్పుడు తన 50వ సినిమా మహారాజా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు విజయ్ సేతుపతి. తాను ఇక మీద స్టార్లతో కలిసి పని చేయనని, విలన్ పాత్రలకు దూరంగా ఉంటానని చెప్పడం గమనార్హం.

ఈ సందర్భంగా తన వల్లే ఓ హీరోయిన్‌కు తనతో యాక్ట్ చేసే ఛాన్స్ పోయిందని నిర్మోహమాటం లేకుండా నిజాన్ని అంగీకరించాడు ఈ కోలీవుడ్ సూపర్ స్టార్. ఆమె ఎవరో కాదు కృతి శెట్టి. డీఎస్పీ సినిమాలో కృతిని హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నారట దర్శక నిర్మాతలు. ఆమెను తీసుకుంటే.. తాను చేయనని చెప్పాడు. దానికి కారణం ఆమెతో కలిసి తాను ఉప్పెనలో నటించడమే.. అందులో తండ్రి, కూతుళ్లుగా నటించామని, కుమార్తెగా చేసిన అమ్మాయితో రొమాన్స్ చేయనని, అందుకే ఆమెకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వలేదని చెప్పాడు. కాగా, ఈ వార్త గతంలో కూడా వచ్చింది. అయితే అదంతా రూమర్ అనుకున్నారు కానీ. ఇప్పుడు స్వయంగా విజయ్ సేతుపతిని ఈ మ్యాటర్ పై స్పందించడం గమనార్హం.

అలాగే ఉప్పెన షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను కూడా చెప్పాడు విజయ్. కృతి ఆ సినిమా క్లైమాక్స్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు కాస్త కంగారు పడింది. అప్పుడు ఆమెకు తాను ధైర్యం చెప్పానని తెలిపాడు. ‘ నాకు నీ వయస్సున్న కుమారుడు ఉన్నాడు. నన్ను నీ తండ్రిగా భావించు’ అని చెప్పినట్లు పేర్కొన్నాడు. అలా కూతురిగా చేసిన అమ్మాయితో రొమాన్స్ చేయలేక.. నిర్మాతలు ఆ అమ్మాయిని తీసుకోవద్దని చెప్పాను అని పేర్కొన్నాడు. దీంతో మీరు చేసింది మంచి పని ప్రశంసిస్తున్నారు ప్రేక్షకులు. ఈ ఏడాది మేరీ క్రిస్మస్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విజయ్ .. త్వరలోనే మహారాజా మూవీతో రాబోతున్నాడు. త్వరలో తాను దర్శకత్వం వహించే అవకాశాలున్నట్లు చెప్పుకొచ్చాడు.  అలాగే ఇక మీద విలన్ పాత్రలు, అతిథి పాత్రలు పోషించనని స్పష్టం చేశాను. ఈ మధ్య కాలంలో అలాంటి ఎన్నో పాత్రలను నిరాకరించినట్లుగా వెల్లడించాడు ఈ కోలీవుడ్ స్టార్.  తెలుగులో ఉప్పెనతో పాటు మైఖేల్, సైరా నరసింహ రెడ్డి వంటి చిత్రాల్లో నటించాడు.