iDreamPost
android-app
ios-app

మెగా ఫ్యామిలీ అల్లుడు కాబోతున్న తరుణ్ అంటూ వార్తలు! అసలు నిజం?

మెగా ఫ్యామిలీ అల్లుడు కాబోతున్న తరుణ్ అంటూ వార్తలు! అసలు నిజం?

ఒకప్పటి టాలీవుడ్  లవర్ బాయ్ తరుణ్ గురించి… తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నువ్వేకావాలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన తరుణ్..  ఆ తరువాత అనే హిట్ సినిమాలో నటించి.. లవర్ బాయ్ గా గుర్తింపు పొందారు. అయితే ఇంకా పెళ్లికానీ హీరోల లిస్టులోనే ఉండిపోయారు. ఆ  లిస్టు నుంచి బయటకు వచ్చేందుకు హీరో తరుణ్ త్వరలోనే పెళ్లి చేసుకుబోతున్నారు. ఈ విషయాన్ని తరుణ్ తల్లి ఇటీవల వెల్లడించారు. అయితే తరుణ్ పెళ్లి చేసుకోబోయేది అయితే మెగా ఫ్యామిలీ అమ్మాయినే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ వార్తల్లో నిజమెంత?  ఆవివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకప్పటి టాలీవుడ్ లవర్ బాయ్ తరుణ్ గురించి ఇప్పుడు ఓ వార్త నెట్టింట బాగా వైరల్ గా మారింది. తరుణ్ మెగా ఫ్యామిలీ అల్లుడు కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతోంది. పలు మీడియా సంస్థలు కథనాలు కూడా రాసేశాయి. మెగాస్టార్ చిరంజీవి అల్లుడుగా తరుణ్ మెగా ఫ్యామిలీలో అడుగుపెడుతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ వార్త ప్రచారమవ్వడానికి కారణం లేకపోలేదు.

తరుణ్ తల్లి రోజా రమణి ఇటీవల ఆయన పెళ్లి గురించి మీడియాతో మాట్లాడారు. అదే ఇప్పుడు ఈ వార్తలకు కారణమయ్యింది. త్వరలోనే తరుణ్ పెళ్లి జరుగుతుందని.. ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయే తమ ఇంటి కోడలు కాబోతుందని ఆమె అన్నారు. దీంతో తరుణ్ మెగా ఫ్యామిలీ అల్లుడు అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ అంటే టక్కున గుర్తొచ్చేది.. మెగా, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి వారి కుటుంబాలే. అక్కినేని కుటుంబంలో అమ్మాయిలు లేరు. నందమూరి కుటుంబంలో బాలకృష్ణ ఇద్దరు కూతుర్లకు పెళ్లిళ్లు అయిపోయాయి.

దగ్గుబాటి కుటుంబంలో వెంకటేష్ కుటుంబంలో పెళ్లి కాని అమ్మాయి ఉన్నా వయసులో తరుణ్ కంటే చాలా చిన్నది. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ అమ్మాయి కూడా కాదు. ఇక మిగిలింది మెగా ఫ్యామిలీ అని చెప్పి.. తరుణ్ మెగా ఇంటి అల్లుడు కాబోతున్నారంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ విషయం గురించి తరుణ్ తల్లి ఎక్కడా కూడా కన్ఫర్మ్ చేసి చెప్పలేదు. ఇండస్ట్రీలో పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయితోనే తరుణ్ పెళ్లి ఉంటుందని చెప్పారే తప్ప.. ఆ అమ్మాయే అని ఎక్కడా ఎవరితోనూ చెప్పలేదు. అటు మెగా ఫ్యామిలీ మెంబర్స్, ఇండస్ట్రీ వర్గాల వారు దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫేక్ న్యూసే.

కానీ కొంతమంది పనిగట్టుకుని మరీ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు. ప్రధానమైన మీడియా సంస్థలు కొన్ని కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మాల్సిన పని లేదు. త్వరలో తరుణ్ పెళ్లి ఉంటుంది కానీ ఎవరితో అనేది త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు. ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీలు అంటే నాలుగు కుటుంబాలే కాదు.. ఇంకా చాలా కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి మెగా ఫ్యామిలీకి, తరుణ్ పెళ్లికి ఎలాంటి సంబంధం లేదు. ఇది ఒక రూమర్ మాత్రమే. మరి..  ఈ న్యూస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఈ వారం థియేటర్స్.. ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom