iDreamPost
iDreamPost
సంక్రాంతి సినిమాలు వచ్చి 20 రోజులు దాటేసింది. రేస్ లో గెలిచింది రెండే. అందులోనూ అల వైకుంఠపురములో ఫస్ట్ ప్లేస్ రాగా సరిలేరు నీకెవ్వరు రెండో స్థానంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఇక దర్బార్, ఎంత మంచివాడవురా టపా కట్టేశాయి. మాములుగా ఎంత పెద్ద హిట్ అయినా కొత్త సినిమాల హడావిడి రెండు మూడు వారాలు మాత్రమే ఉంటుంది. కానీ బన్నీ మహేష్ సినిమాలు నాలుగో వారంలోకి అడుగు పెడుతున్న సమయంలో కూడా ప్రేక్షకులకు వేరే ఆప్షన్ లేకపోవడం నిజంగా విచారకరం. దానికి కారణం ఈ గ్యాప్ ని ఎవరూ వాడుకోకపోవడమే.
ముందుగా వచ్చిన రవితేజ డిస్కోరాజా కనీస అంచనాలు అందుకోలేక చేతులు ఎత్తేయగా నిన్న విడుదలైన అశ్వద్ధామకు సైతం ఏమంత చెప్పుకోదగ్గ టాక్ రాలేదు. ఇక చూసి చూడంగానేను పట్టించుకున్న ప్రేక్షకులూ తక్కువే. ఈ నేపథ్యంలో మళ్ళీ పండగ సినిమాలు చూడటం తప్ప వీకెండ్ లో ఇంకే ఛాయస్ ఉండటం లేదు. వచ్చే వారం శర్వానంద్ సమంతాల జాను, మరో చిన్న సినిమా సవారి పందెంలో ఉన్నాయి. ఇవి మాస్ కి టార్గెట్ చేసిన మూవీస్ కాదు. టాక్ బాగా వస్తే పికప్ మీద వసూళ్లు రాబట్టుకుంటాయి.
ఉన్నంతలో జానుకి యూత్ లో మంచి బజ్ ఉంది. పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయంటే ఏ సెంటర్స్ లో మంచి ఫిగర్స్ నమోదు చేస్తుంది. సవారికి గట్టి సౌండ్ వినిపిస్తేనే సేఫ్ అవుతుంది. ఆపై విజయ్ దేవరకొండ 14న వరల్డ్ ఫేమస్ లవర్ గా రాబోతున్నాడు. మంచి ఓపెనింగ్స్ వచ్చే సినిమాగా దీని మీద ట్రేడ్ చాలా నమ్మకంతో ఉంది. దాన్ని నిలబెట్టుకుంటే డియర్ కామ్రేడ్ తాలూకు గాయాలు మాయమైపోతాయి. ఇప్పటికైతే హైప్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఫిబ్రవరి వచ్చేసింది కాబట్టి సంక్రాంతి సినిమాల తర్వాత వచ్చిన గ్యాప్ ని నింపే సినిమా ఏదో వేచి చూడాలి మరి