జాతీయ మీడియా ప్రశంసలు అందుకుంటున్న వాలంటీర్ వ్యవస్థ.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ కరోనా కట్టడికి చేపడుతున్న ఇంటి ఇంటి సర్వే పెద్ద ఎత్తున సత్ఫలితాలను ఇస్తుంది. రాష్ట్రంలోకి విదేశాలనుండి వచ్చిన వారి ఖచ్చితమైన సంఖ్యను గుర్తించి, ప్రభుత్వానికి గంటల వ్యవధిలో వారి డేటాను అందజేసి వైద్య పరీక్షలు నిర్వహించి, వారిని బయటికి రాకుండా శ్వీయ నిర్భందం పట్ల అవగాహన కల్పించి కరోనా ని రాష్ట్రంలో నియంత్రించడంలో వాలంటీర్ల సేవలు అనిర్వచనీయం అని చెప్పవచ్చు.

రాష్ట్రంలో ఉన్న 4.50 లక్షల వాలంటీర్లతో పాటు ఆశా వర్కర్లు తమకు కేటాయించిన 50 ఇళ్ళను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకోవడంతో, ప్రభుత్వానికి కరోనా సోకిన వారిని వెంటనే గుర్తించడం సులువైంది. దీంతో ప్రభుత్వం తగు సమయంలో వారికి వైద్య సేవలు అందించి క్వారంటైన్ చేసి ఈ వైరస్ ప్రబలకుండా అడ్డుకట్ట వేయగలిగింది. మరే ఇతర రాష్ట్రంలో కూడా వ్యాదిగ్రస్తులని ఇంత త్వరగా గుర్తించి వారికి తగు సమయంలో వైద్య సేవలు అందించిన దాఖలాలు లేవు అంటే ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రానికి ఈ వాలంటీర్ల వ్యవస్థ చేస్తున్న మేలు ప్రశంసనీయం.

ఇప్పటికే ఇతర రాష్ట్రాలు కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించడంలో తీవ్ర జాప్యం జరిగి రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఆయా ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు ఆంద్రప్రదేశ్ లో సత్ఫలితాలు ఇస్తున్న వాలంటీర్ల వ్యవస్థ పై అధ్యయనం చేయడం మొదలు పెట్టాయి. ఇప్పటికే కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో 2 లక్షల పై చిలుకుతో కూడిన వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టబోతునట్టు ప్రకటించింది. అలాగే ఇతర రాష్ట్రాలు కూడా ఈ వ్యవస్థ పనితీరు పై క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ప్రారంబించాయి . బ్రిటన్ , ఇండోనేషియా దేశాలు కూడా ఇప్పటికే కరోనా కట్టడికి విలేజ్ స్క్వాడ్స్ పేరుతో వాలంటీర్లను రంగంలోకి దించింది.

ఇలా అన్ని వైపుల కరోనా కట్టడికి శ్రమిస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై పలువులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు . ఇందులో బాగంగా జాతీయ మీడీయా సైతం ఈ వాలంటీర్ల వ్యవస్త పనితీరుపై పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తుంది. అన్ని రాష్ట్రాలు ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఇలాంటి వ్యవస్థను రూపొందించుకోవాలని, ఇది అన్ని విదాలుగా రాష్ట్రాలకి ఉపయోగ కరమైన వ్యవస్థ అని, ఇటువంటి వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంటే ఏ సమస్య అయిన ధైర్యంగా గంటల వ్యవధిలో ఎదుర్కోవచ్చని , కావున రాష్ట ప్రభుత్వాలు ఈ వ్యవస్థపై దృష్టి పెట్టాలని చెప్పుకొచ్చింది . రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యవస్థను ఏర్పాటు చేసే సమయంలో ఎదురైన విమర్శలకు అదే వ్యవస్థ ఈ విపత్కర పరిస్తితుల్లో తమ పని తీరుతో ప్రశంసలు పొందటంతో పాటు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారింది.

Show comments