ఒక పక్క దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంబిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో కుడా ముఖ్యమంత్రి దగ్గర నుండి చివరి గ్రామస్థాయి వార్డు వాలాంటీర్ వరకు అధికార యంత్రాంగం మొత్తం కొరోనా వైరస్ కట్టడి లో తలమునకలై ఉంటే.. బాహ్యప్రపంచంతో సంభందం లేకుండా సురక్షితంగా హైదరాబాద్ లోని సొంత ఇంటిలోనే తలదాచుకుంటున్న రాష్ట్ర ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ మాత్రం ఈ విపత్తు కాలంలో కూడా ట్విట్టర్ వేదిక గా రాష్ట్ర ప్రభుత్వం పై ఆరోపణల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు.
తాజాగా నారా లోకేష్ మాత్రం ఒక అడుగు ముందుకేసి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి లాక్ డౌన్ సమయంలో తన జన్మదినం రోజున కుటుంబంతో కలసి శ్రీవారి సన్నిధిని సందర్శించారంటూ ట్విట్టర్ లో తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది.
అయితే వివరాల్లొకి వెళితే తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి శుక్రవారం ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకానికి రెండు వారాలకు ఒకసారి టీటీడి చైర్మన్ హాజరుకావడం ఆనవాయితి. టీటీడి ప్రొటొకాల్ ప్రకారం అర్చకులు, దేవస్థానం ఈవో, టీటీడి చైర్మన్ లు సతీ సమేతంగా హాజరవుతారు. కాగ, మొన్న శుక్రవారం కూడా ప్రొటోకాల్ ప్రకారమే టీటీడి ఉధ్యొగస్తులతో కలసి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్య, తల్లి గారు స్వామి వారి అభిషేకానికి హాజరయ్యారు.
యాదృచ్ఛికంగా అదే రోజు సుబ్బారెడ్డి పుట్టిన రోజు కావడం విశేషం.
యధావిధిగా అభిషేకం ముగిసిన తర్వాత టీటీడి ఉద్యోగులు, కుటుంబ సభ్యులతో కలసి చైర్మన్ శ్రీవారి ఆలయం ముందు ఒక ఫొటొ దిగారు. అయితే ఈ ఫొటో ని పట్టుకొని నారా లొకేష్ తన రాజకీయ పైత్యాన్ని జోడించి టీటీడి చైర్మన్ అని ప్రస్తావించకుండా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పేరు ను అనవసరంగా వివాదంలోకి లాగుతూ రాజశేఖర రెడ్డి తొడల్లుడు అంటూ ఏమాత్రం నైతికత లేకుండా ఒక వివాదాస్పద ట్విట్ చేయడంతో నారా లొకేష తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది.
లోకేష్ వివాదాస్పద ట్విట్ పై టీటీడి ఉద్యోగులతో పాటు రాజకీయాలకు అతీతంగా తటస్తంగా ఉండే కొందరు శ్రీవారి భక్తులు కుడా మండి పడుతున్నారు. ఒకపక్క లాక్ డౌన్ సమయంలోనూ సాధారణ భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనప్పటికి స్వామి వారికి జరగవల్సిన పూజలు, అలంకారాలు, అభిషేకాలు, నైవేధ్యాలు లాంటి నిత్య కైంకర్యాలు ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతూనే ఉన్నాయి.
వాస్తవాలు ఈవిధంగా ఉంటే నారా లోకేష్ మాత్రం ఏమాత్రం అవగాహన, ఇంకితజ్నానం లేకుండా కోట్ల మంది భక్తుల మనోభావాలలతో కూడిన వ్యవహారాల్లో తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూడడం, సామాజిక మాధ్యమాలను అడ్డం పెట్టుకుని అసత్య ప్రచారానికి తెరతీయడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విపత్కర సమయంలో ప్రజల బాగోగుల కోసం తగు సూచనలిస్తూ కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి.. ఇలాంటి నీచ రాజకియాలు చెయ్యడం ఇంతకముందు ఎప్పుడూ చూడలేదని.. లోకేష్ తీరుపై అధికార పార్టీ నేతలు మండి పడుతున్నారు.
కాగ, ఈ మొత్తం వ్యవహారం పై టీటీడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ ప్రతి శుక్రవారం జరిగే శ్రీవారి అభిషేకానికి రెండు వారాలకొకసారి తాను హాజరవడం ఆనవాయితీ అని అందులో భాగంగానే తన భార్య, తల్లిగారితో పాటు టీటీడి ఉద్యోగుల తో కలసి హాజరయినట్టు తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ చేసిన ట్విట్ పై ఆయన ఆగ్రహం చేశారు. కావాలని తనపై అసత్య ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని నారా లోకేష్ ను హెచ్చరించారు. తిరుమల శ్రీవారి ఆశలయంలొ నిభందనలు ఉల్లంఘించారనే ప్రచారం పచ్చి అబద్దమని, పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి విషయంలో పరాచకాలు పనికి రావని, ఇప్పటికైన లోకేష్ తన తప్పు తెలుసుకోవాలని టీటీడి చైర్మన్ నారా లోకేష్ కి హితబోధచేశారు.
ఈవిధంగా ఏ మాత్రం అవగాహన లేకుండా నారా లోకేష్ చేసిన ఒక ట్విట్ చివరికి ఆతని మెడకే చుట్టుకుందని స్వయానా కొందరు తెలుగుదేశం నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.