iDreamPost
android-app
ios-app

‘ఘర్షణ’ పడబోతున్న నాని జగదీష్ ?

  • Published Mar 02, 2020 | 1:37 PM Updated Updated Mar 02, 2020 | 1:37 PM
  • Published Mar 02, 2020 | 1:37 PMUpdated Mar 02, 2020 | 1:37 PM
‘ఘర్షణ’ పడబోతున్న నాని జగదీష్ ?

మొదటిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించిన నాని తన కొత్త సినిమా ‘వి’ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నెల 25న రావడం ఎప్పుడో ఫిక్స్ అయ్యింది కాబట్టి అభిమానుల చూపు దాని మీదే ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేసవిలోనే విడుదల ప్లాన్ వేసవి చేశారు. టైటిల్ వెరైటీగా క్యాచీగా ఉండటం ప్లస్ అవుతోంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం దీని కథకు సంబంధించిన కొన్ని లీక్స్ ప్రచారంలోకి వచ్చాయి.

గతంలో ఇది 1992లో వచ్చిన బలరామకృష్ణులు తరహాలో ఉంటుందని టాక్ వచ్చింది. కాని ఇప్పుడు మరో క్లాసిక్ సినిమా గురించి చెప్పుకుంటున్నారు. అదే మణిరత్నం ఘర్షణ. 1988లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్. ఇళయరాజా సంగీతం కూడా పెద్ద హిట్టు. ఒకే నాన్నకు ఇద్దరు తల్లుల ద్వారా కలిగిన అన్నదమ్ముల మధ్య సాగే యుద్ధం కథగా మంచి భావోద్వేగాలతో మణిరత్నం దీన్ని తెరకెక్కించారు. ప్రభు, కార్తిక్ ల పోటాపోటీ నటన నువ్వా నేనా అనే రీతిలో సాగుతుంది.

ఇప్పుడు వచ్చిన వార్త ప్రకారం నాని చేస్తోంది కార్తీక్ టైపు పాత్రట. మరి ప్రభులా చేయబోయే హీరో ఎవరు అంటే మాత్రం ఇంకా సమాధానం దొరకడం లేదు. జగపతిబాబునే యంగ్ లుక్ లోకి మార్చి నాని అన్నయ్యగా చూపించే అవకాశం ఉందట. ఇదంతా అధికారికంగా తెలిసేది కాదు కాబట్టి ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. శివ నిర్వాణ గత రెండు సినిమాలు నిన్ను కోరి హిందీ మూవీ హం దిల్ దే చుకే సనం చాయల్లో, మజిలి మౌనరాగం స్టైల్ లో సాగే సంగతి తెలిసిందే. ఈ లెక్కన టక్ జగదీశ్ గురించి వచ్చిన టాక్ కూడా నిజమేనేమో.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetjolly girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş