iDreamPost
android-app
ios-app

క్రియేటివ్ డైరెక్టర్ తో నాని 28

  • Published May 13, 2020 | 11:57 AM Updated Updated May 13, 2020 | 11:57 AM
క్రియేటివ్ డైరెక్టర్ తో నాని 28

ప్రస్తుతం ‘వి’ విడుదల కోసం ఎదురు చూస్తున్న న్యాచురల్ స్టార్ నాని లాక్ డౌన్ ఎత్తేయగానే శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీశ్’ షూటింగ్ ని కంటిన్యూ చేస్తాడు. అది కూడా ఎక్కువ ఆలస్యం చేయకుండా దసరాలోపు ఫినిష్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. దీని తర్వాత టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో ‘శ్యాం సింగ రాయ్’తో కొనసాగుతాడు. దీని రిలీజ్ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఉంటుంది. వీటి తర్వాత కూడా తన ప్రాజెక్ట్ లైన్ అప్ ని నాని రెడీ చేసుకుంటున్నాడు.

‘మెంటల్ మదిలో’తో పరిచయమై ‘బ్రోచేవారెవరురా’తో మరో సక్సెస్ అని అందుకున్న వివేక్ ఆత్రేయతో నాని జట్టు కట్టబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దీనికి నిర్మాతగా వ్యవహరించబోతోంది. గతంలో ‘గ్యాంగ్ లీడర్’ చేసిన ఈ సంస్థ దాని రూపంలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అందుకే ఇప్పుడీ సినిమా ద్వారా గట్టి హిట్టు కొట్టాలని వివేక్ ఆత్రేయను తీసుకున్నట్టు తెలిసింది. లైన్ వినగానే నానికి బాగా నచ్చిందని వెంటనే స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనులు పురమాయించినట్టు సమాచారం.

ఫస్ట్ మూవీకి లవ్ స్టోరీ రెండో సినిమాకు కిడ్నాప్ డ్రామా ఎంచుకున్న వివేక్ ఆత్రేయ నాని కోసం ఎలాంటి జానర్ ఎంచుకున్నాడన్న ఆసక్తి అభిమానుల్లో కలగడం సహజం. అయితే ప్రస్తుతానికి ఆ వివరాలు ఏవీ బయటికి వచ్చే అవకాశాలు లేవు. ఎక్కడా గ్యాప్ లేకుండా వరసగా సినిమాలు ఒప్పుకుంటున్న నాని 2020లో మూడు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు కానీ కరోనా వల్ల ఆ అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం నాని 28కి హీరోయిన్ తో పాటు టెక్నికల్ టీమ్ ని సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు వివేక్ ఆత్రేయ. పరిస్థితి నార్మల్ అయ్యాక మిగిలిన వివరాలు తెలిసే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన కూడా అప్పుడే రావొచ్చు.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet