iDreamPost
android-app
ios-app

న్యాచురల్ స్టార్ రెండుకే ఫిక్స్

  • Published May 10, 2020 | 7:29 AM Updated Updated May 10, 2020 | 7:29 AM
  • Published May 10, 2020 | 7:29 AMUpdated May 10, 2020 | 7:29 AM
న్యాచురల్ స్టార్ రెండుకే ఫిక్స్

లాక్ డౌన్ రాకపోయి ఉంటే న్యాచురల్ స్టార్ నాని నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ ‘వి’ ఈపాటికి విడుదలైపోయి 50 రోజులకు దగ్గరగా ఉండేది. సరిగ్గా ఇంకో మూడు రోజుల్లో రిలీజ్ అనగా దేశవ్యాప్తంగా మొత్తం బంద్ అయ్యింది. మే చివరికి పరిస్థితిలో మార్పు ఉండొచ్చని టాక్ ఉంది కానీ థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో మాత్రం క్లారిటీ లేదు. మరోవైపు ఓవర్సీస్ లో మార్కెట్ ఓపెన్ అయితే తప్ప పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కు రెడీ కావు. షూటింగులు వచ్చే నెల నుంచి నిబంధనల మధ్య మొదలయ్యే అవకాశం ఉంది .

ఇదిలా ఉండగా పక్కా ప్లానింగ్ తో ఈ ఏడాది మూడు రిలీజులు ప్లాన్ చేసుకున్న నాని రెండుతో రాజీ పడక తప్పేలా లేదు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టక్ జగదీశ్’ ఇంకా చాలా బాలన్స్ ఉంది. ఎంత లేదన్నా రెండు మూడు నెలలు కావాలి. ఆ లెక్కన చూసుకుంటే అక్టోబర్ లేదా డిసెంబర్ లో దీన్ని విడుదల చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక రాహుల్ సంక్రుత్యాన్ డైరెక్షన్ లో రూపొందబోయే ‘శ్యాం సింగ రాయ్’ ని ముందు డిసెంబర్ రిలీజ్ అని ప్రకటన ఇచ్చారు కాని ఇప్పుడా ఛాన్స్ లేదు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరికో మార్చికో షిఫ్ట్ చేయక తప్పదు.

అంతకన్నా ఆలస్యమైనా ఆశ్చర్యం లేదు. ఈలోగా నాని కొత్త కథలను వినే పనిలో బిజీగా ఉన్నాడు. ఫోన్ లోనే కొందరు నెరేషన్స్ ఇస్తున్నట్టుగా తెలిసింది. ‘భలే భలే మగాడివోయ్’ లాంటి బిగ్ బ్రేక్ ఇచ్చిన మారుతీతో మళ్లి చేసే అవకాశం నానికి దక్కలేదు. ఇప్పుడు ఆ దిశగా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఒకవేళ కథ కనక ఓకే అయితే సెట్స్ పైకి వెళ్ళడానికి పెద్ద టైం పట్టకపోవచ్చు. కరోనా వల్ల నాని అనుకున్న ప్లానింగ్ మటుకు డిస్టర్బ్ అయిన మాట వాస్తవం. వి మీద భారీ అంచనాలు నెలకొన్న నేపధ్యంలో నిర్మాత దిల్ రాజు ఎట్టి పరిస్థితుల్లో ఓటిటి ద్వారా కాకుండా థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపుతున్నారు. కరోనా మొత్తం క్లియర్ అయ్యాక మందువరసలో వినే ఉంది. డేట్ మాత్రం ప్రకటించాల్సి ఉంది.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet