iDreamPost
android-app
ios-app

అమెరికాలో వరుసగా ఏడు సినిమాలతో సరికొత్త రికార్డ్ సృష్టించిన నాని..

  • Published Jun 18, 2022 | 7:20 PM Updated Updated Jun 18, 2022 | 7:20 PM
  • Published Jun 18, 2022 | 7:20 PMUpdated Jun 18, 2022 | 7:20 PM
అమెరికాలో వరుసగా ఏడు సినిమాలతో సరికొత్త రికార్డ్ సృష్టించిన నాని..

న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా నటించిన “అంటే సుందరానికీ” సినిమా మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద మంచి ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైనర్ గా నిలిచి హిట్ కొట్టింది. ఈ సినిమాని వివేక్ ఆత్రేయ తెరకెక్కించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఇక ఇక్కడ కలెక్షన్స్ లో పర్వాలేదనిపించినా యూఎస్ బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూలు చేస్తుంది అంటే సుందరానికి సినిమా.

మన తెలుగు సినిమాకి దేశం బయట అమెరికా మంచి మార్కెట్. మన ప్రతి తెలుగు సినిమా అక్కడ రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ ని సాధిస్తుంది. ఇక స్టార్ హీరోల సినిమాలు అయితే కలెక్షన్స్ అదరగొడతాయి, అమెరికాలో ఒక తెలుగు సినిమా 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది అంటే భారీ కలెక్షన్స్ వచ్చినట్టే. ఇటీవల రిలీజ్ అయిన మన భారీ తెలుగు సినిమాలన్నీ బాగా కలెక్ట్ చేశాయి.

నానికి కూడా అమెరికాలో మంచి మార్కెట్ ఉంది. నాని ఇప్పటికే పలు సినిమాలతో అమెరికాలో 1 మిలియన్ డాలర్ మార్క్ ని అందుకున్నాడు. తాజాగా వచ్చిన అంటే సుందరానికి సినిమాతో కూడా ఈ ఫీట్ సాధించి సరికొత్త రికార్డ్ సాధించాడు. వరుసగా ఏడు సినిమాలతో నాని అమెరికాలో 1 మిలియన్ డాలర్ మార్క్ అందుకొని ఈ రికార్డు సృష్టించాడు. మరోసారి న్యాచురల్ స్టార్ గా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటాడు నాని.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet