Swetha
కొన్ని సినిమాలు ఓటీటీ లోకి వచ్చే ముందు విపరీతమైన బజ్ తో వస్తాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎటువంటి బజ్ లేకుండా స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే.
కొన్ని సినిమాలు ఓటీటీ లోకి వచ్చే ముందు విపరీతమైన బజ్ తో వస్తాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎటువంటి బజ్ లేకుండా స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే.
Swetha
ఓటీటీ లో అనేక సినిమాలు, సిరీస్ లు నిత్యం వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకులకు చూసే ఓపిక తీరిక ఉండాలే కానీ, చూస్తున్న కొద్దీ తరిగిపోని ఇంకా ఎన్నో సినిమాలు, సిరీస్ లు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఉన్నాయి. ఇప్పటివరకు మనం చెప్పుకుంటున్నవి అన్ని కేవలం అఫీషియల్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోవే. కానీ, అవి మాత్రమే కాకుండా ఇంకా చాలానే సైట్స్ లో అనేక సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఓటీటీ లోకి వచ్చే ముందు విపరీతమైన బజ్ తో వస్తాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎటువంటి బజ్ లేకుండా స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
ఇప్పుడు ప్రేక్షకులు కేవలం తెలుగు సినిమాలను మాత్రమే చూస్తాము అని అనుకోడం లేదు . భాష బేధం లేకుండా ఆ సినిమాలు అర్ధం కాకపోయినా సరే.. సబ్ టైటిల్స్ పెట్టుకుని మరి. ఆయా సినిమాలను చూస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను కూడా ఈజీగానే చూసేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా ఓ తమిళ సినిమా. కానీ తెలుగులో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో ఓ ఊరిలో ప్రజలందరికి తరచూ ఎదో ఒక అనారోగ్యం వ్యాపిస్తుంది. ఎంతో మంది పిల్లలు చనిపోతూ ఉంటారు. ఇదే ప్లాట్ ను తెలుగులో రిలీజ్ అయినా ఖలేజా సినిమాలో చూసి ఉంటారు. అచ్చం అలాంటిదే కానీ అది కాదు. సరిగ్గా ఆ గ్రామస్తులంతా ఇబ్బందులలో ఉన్నపుడు ఆ ఊరికి ఓ డాక్టర్ ట్రాన్ఫర్ ఆ ఊరికి మీద వస్తుంది. ఇక ఊరిని ఎలాగైనా బాగు చేయాలనీ అనుకుంటుంది. ఆమె ఆ ఊరి ప్రజలను రక్షించే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది. చివరికి తానూ అనుకున్నది చేయగలిగిందా లేదా అనేదే ఈ సినిమా కథ.
ఈ సినిమా పేరు “నాడు“. గత సంవత్సరం తమిళంలో థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా ..యావరేజ్ టాక్ తో థియేటర్స్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లో సైలెంట్ గా స్ట్రీమింగ్ అయిపోతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి మీ మూవీ వాచ్ లిస్ట్ లో ఈ సినిమాను కూడా యాడ్ చేసేసుకోండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.