Radhe Shyam : డేట్ లాక్ చేసుకున్న పాన్ ఇండియా సినిమా

ఎట్టకేలకు రాధే శ్యామ్ రిలీజ్ కు రూట్ క్లియర్ అయ్యింది. మార్చి 11 థియేట్రికల్ విడుదలకు రంగం సిద్ధమయ్యిందని సమాచారం. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అప్పటికంతా దేశవ్యాప్తంగా సినిమా హాళ్లు పూర్తి స్థాయిలో తెరవడంతో పాటు జన జీవనం ఎప్పటిలాగే ఉంటుందన్న అంచనాతో యువి సంస్థ నిర్ణయం తీసుకున్నట్టుగా ఫిలిం నగర్ టాక్. ఒకవేళ ఆ రోజు ఏదైనా పోటీ ఉన్నా కూడా దాని గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్ళాలని డిసైడ్ అయినట్టుగా ఇన్ సైడ్ న్యూస్. ఆర్ఆర్ఆర్ మార్చి 18కి వచ్చే ఛాన్స్ కూడా లేనట్టే. దానికంటే ఏప్రిల్ 28 వైపే రాజమౌళి మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.

ఇంకా నలభై రోజుల సమయం ఉంది కాబట్టి ప్రమోషన్లు చక్కగా చేసుకోవచ్చు. గతంలో సంక్రాంతి విడుదల అనుకున్నప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్ప నార్త్ లోనూ ఎలాంటి పబ్లిసిటీ కార్యక్రమాలు చేయలేకపోయారు. కానీ ఇప్పుడా ఇబ్బంది లేదు. ముంబై మీడియాతో మొదలుపెట్టి చెన్నై ప్రెస్ మీట్ దాకా అన్నీ చేసుకోవచ్చు. ఏప్రిల్ లో బీస్ట్, కెజిఎఫ్ 2, లాల్ సింగ్ చద్దాలతో పోటీ పడటం కంటే రాధే శ్యామ్ ఇలా సోలో రిలీజ్ దక్కించుకోవడమే మంచిది. కంటెంట్ దృష్ట్యా ఎక్కువ శాతానికి రీచ్ అవ్వాలంటే ఇదే బెస్ట్. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ లవ్ డ్రామాకు జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూర్చారు. బడ్జెట్ మూడు వందల కోట్ల పైమాటే.

మార్చి నెలలో ఇతర బాలీవుడ్ మూవీస్ ఏవి వచ్చినా రాధే శ్యామ్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఓపెనింగ్స్ లో రికార్డులు ఆశించవచ్చు. ఏపిలో టికెట్ రేట్ల గురించి నెలకొన్న ప్రతిష్టంభన అప్పటికంతా తీరిపోవచ్చు. ఖిలాడీ లాంటి సినిమాలకు వచ్చే స్పందన, కలెక్షన్లను బట్టి ట్రెండ్ ని అర్థం చేసుకోవచ్చు. రాధే శ్యామ్ మీద డార్లింగ్ ఫ్యాన్స్ అంచనాలు మాములుగా లేవు. ఆర్ఆర్ఆర్ కంటే చాలా ముందు వస్తోంది కాబట్టి రికార్డ్స్ పరంగా బెంచ్ మార్క్ సెట్ చేయాలని ఎదురు చూస్తున్నారు. మొత్తానికి సుదీర్ఘ నిరీక్షణ తీరిపోయి భారీ పాన్ ఇండియా సినిమా లైన్ క్లియర్ చేసుకుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ కాగా కథా నేపథ్యం యూరప్ లో సాగుతుంది

Also Read : Viraata Parvam : రానా సినిమా రిలీజ్ ఎప్పుడు తేలుతుంది

Show comments