iDreamPost
iDreamPost
స్సైడర్ మ్యాన్ మూవీ ఫ్యాన్స్ కి ఇది అదిరిపోయే వార్త. జూలై 1న డిస్నీ+ హాట్‌స్టార్‌లో వెనమ్ మూవీతోపాటు ఐదు స్పైడర్ మ్యాన్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వెనం (2018), స్పైడర్ మ్యాన్ (2002), స్పైడర్ మ్యాన్ 2 (2004), స్పైడర్ మ్యాన్ 3 (2007), ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ (2012), స్పైడర్ మ్యాన్: హోమ్‌కమింగ్ (2017) జూలై 1న సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులోకి వస్తాయి.
స్పైడర్ మాన్ Spider-Man (2002)
సగటు కుర్రాడు పీటర్ పార్కర్ ప్రమాదవశాత్తూ రేడియోధార్మిక సాలీడు కాటుకు గురైన తర్వాత, అసాధారణ సూపర్‌హీరో- స్పైడర్ మ్యాన్ గా మారిపోతాడు. దోపిడీ సమయంలో మేనమామ హత్య చేయబడినప్పుడు, యువ పీటర్ ఆ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తన శక్తులను వాడతానని ప్రతిజ్ఞ చేస్తాడు. తనను తాను స్పైడర్‌మ్యాన్‌గా భావించి, సూపర్-విలన్ గ్రీన్ గోబ్లిన్ పోరాటానికి దిగుతాడు.
స్పైడర్ మాన్ 2 Spider-Man 2 (2004)
స్పైడర్ మ్యాన్ 2లో, టోబే మాగైర్ కాలేజ్ స్టూడెంట్ గా, మానవాతీత స్పైడర్ మ్యాన్ గా జీవితంలోని రెండు సున్నితమైన కోణాలను, గారిడీలా బ్యాలెన్స్ చేస్తున్న పీటర్ పార్కర్‌గా తిరిగి వస్తాడు. ఒట్టో ఆక్టేవియస్ డాక్ ఓక్‌గా పునర్జన్మ పొందడంతోనే, పీటర్ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. MJని విలన్ డాక్ ఓక్ కిడ్నాప్ చేసినప్పుడు, స్పైడర్ మ్యాన్ తిరిగి యాక్షన్ లోకి దిగుతాడు.
స్పైడర్ మాన్ 3 Spider-Man 3 (2007)
పీటర్ పార్కర్ చివరకు తన డ్రీమ్ గర్ల్ మేరీ జేన్ వాట్సన్ ప్రేమలో ఉన్నాడు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో, ఒక వింత గ్రహాంతర జీవంతో సూట్ నల్లగా మారినప్పుడు, స్పైడర్ మ్యాన్ మారిపోతాడు .అప్పుడు శాండ్‌మ్యాన్, వెనం, న్యూ గోబ్లిన్ తోపాటు తనలోని శత్రువుతో స్సైడర్ మ్యాన్ సంకుల సమరం చేయాల్సి వస్తుంది.
ది అమేజింగ్ స్పైడర్ మాన్ The Amazing Spider-Man (2012)
పేరెంట్స్ విడిచిపెట్టారు, అత్తామామల దగ్గరపెరిగిన కుర్రాడు పీటర్ పార్కర్ అంటే మన స్పైడర్ మ్యాన్, తన మొదటి క్రష్, గ్వెన్ స్టేసీ పట్ల అతని ఫీలింగ్స్ తెలుసుకోవడానికి కిందామీదాపడుతున్నాడు. ఈసమయంలోనే పీటర్ తన తండ్రి బ్రీఫ్‌కేస్‌ను కనిపెడతాడు, అక్కడ నుంచి తన పేరెంట్స్ అదృశ్యం వెనుకున్న రహస్యాన్ని కనుక్కోవడానికి అన్వేషణ మొదలుపడతాడు. అదికాస్తా, ఆస్కార్ప్, డాక్టర్ కర్ట్ కానర్స్ ల్యాబ్‌కు తీసుకువెళుతుంది, కానర్స్ ఆల్టర్ ఇగో, ది లిజార్డ్‌తో ఢీ కొనాల్సిన పరిస్థితి వస్తుంది.
స్పైడర్ మాన్: హోమ్‌కమింగ్ Spider-Man: Homecoming (2017)
పీటర్ పార్కర్/స్పైడర్ మ్యాన్ వెబ్-స్లింగింగ్ సూపర్ హీరోగా తన కొత్త గుర్తింపును తెలుసుకోవాలనుకొంటాడు. ఇంటికి తిరిగి వస్తాడు, అక్కడే అత్తతో ఉంటున్నాడు. ఇప్పుడు అతని కొత్త గురువు టోనీ స్టార్క్ అతనిమీద కన్నేసి ఉంచాడు. పీటర్ తన మామూలు జీవితంలోకి జారిపోతున్నప్పుడు వల్చర్ కొత్త విలన్ గా వస్తాడు. అతని నుంచి పీటర్ తన వారిని రక్షించుకోవాల్సి వస్తుంది.
వెనం Venom (2018)
వెనం …మార్వెల్ , టెన్సెంట్ పిక్చర్స్‌తో కలిసి కొలంబియా పిక్చర్స్ నిర్మించిన సినిమా. అదే పేరుతో మార్వెల్ కామిక్స్ పాత్రకూడా ఉంది. ఇది సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ (SSU) లో ఫస్ట్ మూవీ. ఇందులో టామ్ హార్డీ ఎడ్డీ బ్రాక్ , వెనమ్‌గా మిచెల్ విలియమ్స్ నటించారు. ఈ సినిమాలో, జర్నలిస్ట్ బ్రాక్ ఒక గ్రహాంతర జీవం వెనంకు హోస్ట్‌గా మారతాడు. ఆ తర్వా తనుంచి అతనికి సూపర్ పవర్ వస్తుంది. ఈ వెనం జాతి భూమిపై దాడి చేయాలని ప్లాన్ చేస్తుంది.