iDreamPost
android-app
ios-app

Jio Plans: హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ను ఫ్రీగా అందించే జియో రీఛార్జ్‌ ప్లాన్లు ఇవే

  • Published May 04, 2024 | 12:40 PM Updated Updated May 04, 2024 | 12:40 PM

తన వినియోగదారుల కోసం జియో కొన్ని అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. వీటి ద్వారా టాక్‌టైమ్‌, డెయిలీ డేటాతో పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా పొందవచ్చు. ఆ వివరాలు..

తన వినియోగదారుల కోసం జియో కొన్ని అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. వీటి ద్వారా టాక్‌టైమ్‌, డెయిలీ డేటాతో పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా పొందవచ్చు. ఆ వివరాలు..

  • Published May 04, 2024 | 12:40 PMUpdated May 04, 2024 | 12:40 PM
Jio Plans: హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ను ఫ్రీగా అందించే జియో రీఛార్జ్‌ ప్లాన్లు ఇవే

ఓటీటీలకు క్రేజ్‌ భారీగా పెరుగుతోంది. ఇక ఈ మధ్య కాలంలో థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గుతుంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు ఏదో ఓ ఓటీటీకీ సంబంధించిన సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకుంటున్నారు. అయితే ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అయ్యే సినిమాలు మరో దాంట్లో రావు. దాంతో ఆయా చిత్రాలు చూడాలంటే.. వేర్వేరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలి. ఇలా ఓ రెండు, మూడు ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలంటే.. భారీగా చెల్లించాలి. ఓవైపు మోబైల్‌ రీచార్జ్‌.. నెట్‌ కనెక్షన్‌.. మరోపక్క ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ కోసం నగదు చెల్లించడం అంటే చేతి చమురు బాగానే వదులుతుంది. ఇదుగో ఈ సమస్యకు పరిష్కారం చూపుతుంది రిలయన్స్‌ జియో.

ఇప్పటికే వినియోగదారులకు తక్కువ ధరలో టాక్‌ టైమ్‌, నెట్‌ బ్యాలెన్స్‌ ఇచ్చే ప్లాన్లను అందిస్తోంది జియో. ఈ ప్లాన్ రోజువారీ డేటాతో పాటు కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. దీంతో పాటు ఓటీటీ ప్లాన్స్‌ను కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ ప్లాన్ రూ. 148 నుంచి ప్రారంభం అవుతుంది. దీంతో పాటు కంపెనీ అదనపు డేటాను కూడా అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు అపరిమిత 5జీ డేటాను కూడా పొందుతారు.

రూ.148 రీఛార్జ్‌ ప్లాన్‌

జియో నుంచి అందిస్తోన్న చవకైన ప్లాన్‌ ధర 148 రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. అయితే ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే. దీన్ని రీఛార్జ్‌ చేసుకుంటే.. వినియోగదారులకు 10 జీబీ అదనపు డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ రీఛార్జ్‌తో మీరు సోనీలివ్, జీ5 వంటి 12 ఓటీటీ ప్లాట్‌ఫాంలను ఉచితంగా యాక్సెస్‌ చేసుకోవచ్చు.

రూ. 389 ప్లాన్

జియో నుంచి వస్తోన్న మరో చవకైన ప్లాన్‌.. 389 రూపాయలది. దీని వ్యాలిడిటీ 28 రోజుల కాగా.. ప్రతిరోజూ 2 జీబీ డేటాను అందిస్తుంది. దీనితో పాటు అదనంగా మరో 6 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌ను రీఛార్జ్‌ చేసుకుంటే.. అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ కింద మీరు సోనీలివ్, జీ5 వంటి 12 ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ఉన్న కంటెంట్‌ను ఉచితంగా చూడవచ్చు.

రూ. 1198 రీఛార్జ్‌ ప్లాన్

జియో రూ. 1198 ప్లాన్‌లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు కాగా.. ప్రతి రోజు 2 జీబీ డేటాను పొందుతారు. దీంతో పాటు 18 జీబీ అదనపు డేటా లభిస్తుంది. అదే సమయంలో అపరిమిత కాల్స్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ పంపే సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌తో మీరు ప్రైమ్ వీడియో, డిస్నీప్లస్ హాట్‌స్టార్ వంటి 14 ఓటీటీ ప్లాట్‌ఫాంల కంటెంట్‌ను ఉచింతగా చూస్తూ ఎంజాయ్‌ చేయవచ్చు.

రూ. 4498 ప్లాన్

జియో అందిస్తున్న అత్యంత ఖరీదైన ప్లాన్ ఇదే. దీని వాలిడిటీ 365 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌ రీచార్జ్‌ చేసుకుంటే.. రోజువారీ ఎస్ఎంఎస్, అపరిమిత కాలింగ్ సౌకర్యంతో పాటు ప్రతిరోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో మీరు ప్రైమ్ వీడియో, డిస్నీప్లస్ హాట్‌స్టార్ వంటి 14 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కంటెంట్‌ను చూడవచ్చు. వీటితో పాటు ఈ ప్లాన్‌ను రీఛార్జ్‌ చేసుకుంటే.. మీరు అదనంగా 78 జీబీ డేటాను కూడా పొందుతారు.