iDreamPost
android-app
ios-app

ఐదుగురు భార్యలతో భర్త హనీమూన్‌.. OTTలోకి రాబోతున్న వెబ్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

  • Published May 25, 2024 | 11:15 AM Updated Updated May 25, 2024 | 11:15 AM

ఓటీటీలో ఓ కామెడీ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవ్వడానికి రెడీ అవుతుంది. ఇంతకు ఆ వెబ్‌ సిరీస్‌లో ఎవరు నటించారు.. ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతుంది వంటి వివరాలు..

ఓటీటీలో ఓ కామెడీ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవ్వడానికి రెడీ అవుతుంది. ఇంతకు ఆ వెబ్‌ సిరీస్‌లో ఎవరు నటించారు.. ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతుంది వంటి వివరాలు..

  • Published May 25, 2024 | 11:15 AMUpdated May 25, 2024 | 11:15 AM
ఐదుగురు భార్యలతో భర్త హనీమూన్‌.. OTTలోకి రాబోతున్న వెబ్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

రోజు రోజుకు ఓటీటీలో కొత్త కంటెంట్‌ పెరుగుతోంది. థియేటర్స్‌కు వెళ్లి సినిమాలు చేసే వారి సంఖ్య బాగా తగ్గుతోంది. వీకెండ్‌ వచ్చిందంటే చాలు.. ఓటీటీలో నచ్చిన సినిమాలు, కొత్తగా వచ్చిన చిత్రాలు, సిరీస్‌లు పెట్టుకుని ఎంజాయ్‌ చేసే వారి సంఖ్య ఎక్కువవుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు భారీగా ఖర్చు చేసి మరి ప్రతి వారం కొత్త కంటెంట్‌ను ఓటీటీలో విడుదల చేస్తున్నాయి. ఇక స్టార్‌ హీరోలు, నటీనటులు సైతం ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మన దగ్గరనే కాదు ప్రతి ఇండస్ట్రీలో ఇదే పరిస్థితి ఉంది. ఇక ఈ మధ్యకాలంలో ఓటీటీలు, థియేటర్లలో మలయాళ సినిమాలు, సిరీస్‌లు దూసుకుపోతున్నాయి. తాజాగా ఓ మలయాళ నటుడు.. ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. విభిన్నమైన సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆ వివరాలు..

డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఫేమ్‌, నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ యాక్టర్‌ సూరజ్‌ వెంజరమూడు ఓటీటీలోకి ఎంటీ ఇస్తున్నాడు. నాగేంద్రన్స్‌ హనీమూన్స్‌ అనే వెబ్‌ సిరీస్‌తో రాబోతున్నాడు. దీని ఫస్ట్‌లుక్‌ని శుక్రవారం నాడు రిలీజ్‌ చేశారు. వ‌న్ లైఫ్.. ఫైవ్ వైఫ్స్ అంటూ పోస్ట‌ర్‌పై ఉన్న క్యాప్ష‌న్ ఈ ఆస‌క్తిని పంచుతోంది. ఐదుగురు ఫిమేల్ లీడ్ యాక్ట‌ర్స్ మ‌ధ్య‌లో సూర‌జ్ వెంజ‌ర‌మూడు భ‌యంభ‌యంగా కూర్చొని క‌నిపిస్తోన్నాడు. ఇక ఈ సిరీస్‌లో ఐదుగురు భార్య‌లున్న భ‌ర్త‌గా సూర‌జ్ వెంజ‌ర‌మూడు క‌నిపించ‌బోతున్నాడు. ఐదుగురు భార్య‌ల‌తో క‌లిసి భ‌ర్త హ‌నీమూన్ ప్లాన్ చేయ‌డానికి కార‌ణం ఏమిటి.. ఈ ట్రిప్‌లో అత‌డు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. అసలు ఐదుగురు మహిళలను అత‌డు ఎందుకు పెళ్లిచేసుకోవాల్సివ‌చ్చింద‌నే అంశాల‌తో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ వెబ్‌సిరీస్‌ తెరకెక్కుతుంది.

నాగేంద్ర‌న్స్ హ‌నీమూన్స్ వెబ్‌సిరీస్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీలోనూ ఈ సిరీస్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ప్ర‌క‌టించింది. జూన్ ఫ‌స్ట్ వీక్‌లో ఈ మ‌ల‌యాళం కామెడీ సిరీస్ ఓటీటీలో రిలీజ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. ఇక ఈ వెబ్‌సిరీస్‌కు నితిన్ రెంజీ ఫ‌ణిక్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ‌తంలో మ‌ల‌యాళంలో కేర‌ళ క్రైమ్ ఫైల్స్‌, మాస్ట‌ర్ పీస్‌, పెరిల్లోర్ ప్రీమియ‌ర్ లీగ్ అనే వెబ్‌సిరీస్‌ల‌ను రూపొందించాడు నితిన్ రెంజీ ఫ‌ణిక్క‌ర్‌. ఈ సిరీస్‌లు ద‌ర్శ‌కుడిగా అత‌డికి మంచు పేరుతెచ్చిపెట్టాడు. ఈ మూడు సిరీస్‌లు డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లోనే రిలీజ‌య్యాయి. ఇప్పుడు రాబోయే నాగేంద్రన్‌ హనీమూన్స్‌ కూడా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లోనే విడుదల కాబోతుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom