iDreamPost
android-app
ios-app

Hotstar Trending Movies: హాట్ స్టార్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతున్న సినిమాలలో.. మీరు ఎన్ని చూశారు!

  • Published May 07, 2024 | 7:59 PM Updated Updated May 07, 2024 | 7:59 PM

ప్రతి వారం ఓటీటీ లలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలే కాకుండా.. ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో ఏ ఏ సినిమాలు , సిరీస్ లు ట్రెండింగ్ లో ఉన్నాయో కూడా ఆయా సినిమాల జాబితా వచ్చేస్తుంది. మరి ఈ మధ్య కాలంలో హాట్ స్టార్ లో రిలీజ్ అయిన సినిమాల జాబితా ఇలా ఉంది.

ప్రతి వారం ఓటీటీ లలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలే కాకుండా.. ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో ఏ ఏ సినిమాలు , సిరీస్ లు ట్రెండింగ్ లో ఉన్నాయో కూడా ఆయా సినిమాల జాబితా వచ్చేస్తుంది. మరి ఈ మధ్య కాలంలో హాట్ స్టార్ లో రిలీజ్ అయిన సినిమాల జాబితా ఇలా ఉంది.

  • Published May 07, 2024 | 7:59 PMUpdated May 07, 2024 | 7:59 PM
Hotstar Trending Movies: హాట్ స్టార్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతున్న  సినిమాలలో.. మీరు ఎన్ని చూశారు!

కేవలం ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ లు చూడడమే కాకుండా.. ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో ఏ ఏ సినిమాలు, సిరీస్ లు టాప్ ట్రేండింగ్ లో ఉన్నాయో కూడా ఈ మధ్య లిస్ట్ వచ్చేస్తుంది. పైగా ఎవరు ఊహించని విధంగా థియేటర్ లో యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి వచ్చే సరికి సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంటున్నాయి. ఇప్పటివరకు అలాంటి సినిమాలను ఎన్నో చూశాము. ఇక ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ హాట్ స్టార్ లో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. మరి ప్రస్తుతం హాట్ స్టార్ లో ట్రేండింగ్ లో ఉన్న సినిమాలేంటో చూసేద్దాం.

1. భీమా:

గోపీచంద్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ సినిమా థియేటర్ లో హిట్ టాక్ సంపాదించుకోలేకపోయినా కూడా.. ఓటీటీ లో మాత్రం మంచి వ్యూవర్ షిప్ తో దూసుకుపోతుంది. ఇంకా ఈ సినిమా ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

2. సైరన్:

కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ సముద్రఖనిప్రధాన పాత్రలలో నటించిన.. ఈ సినిమా తమిళంలో సూపర్ సక్సెస్ అందుకున్న తర్వాత.. ఇక ఇప్పుడు ఈ సినిమా తెలుగులో కూడా ఓటీటీ లో రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రస్తుతం హాట్ స్టార్ లో ట్రేండింగ్ వ్యూస్ తో దూసుకుపోతుంది.

3. సేవ్ ది టైగర్ 2:

సేవ్ ది టైగెర్స్ మొదటి సీజన్ కు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో ఉంచుకుని.. రెండవ సీజన్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఊహించినట్లుగానే ఈ సీజన్ కు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సిరీస్ హాట్ స్టార్ లో విడుదలయ్యి చాలా రోజులు అయినప్పటికీ. ఇంకా ట్రేండింగ్ వ్యూస్ తో కొనసాగుతుంది.

4. లూటర్:

ఈ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సముద్రంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను బందిపోట్లు బంధిస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి. వారి నుంచి ఎలా తప్పించుకోగలుగుతారు అనే కాన్సెప్ట్ పైన వచ్చిన ఈ చిత్రం అందరిని ఆకట్టుకుని.. ట్రేండింగ్ లో నిలిచింది.

5.మంజుమ్మెల్‌ బాయ్స్‌:

సర్వైవల్ థ్రిల్లర్స్ అన్నిటిలో కంటే బెస్ట్ అనిపించుకుంది ఈ సినిమా.. అటు మలయాళంలోనూ.. ఇటు తెలుగు థియేటర్స్ లోను సూపర్ సక్సెస్ సాధించిన తర్వాత.. ఇప్పుడు ఓటీటీ లోను ఈ సినిమా మంచి వ్యూస్ తో హాట్ స్టార్ లో ట్రెండింగ్ అవుతుంది.

6. లవర్:

తమిళంలో ప్రేక్షకుల మదిని దోచుకున్న ఈ సినిమా.. తెలుగులో కూడా రిలీజ్ థియేటర్స్ లో రిలీజ్ అయింది. అయితే తెలుగు థియేటర్స్ లో ఈ సినిమాకు ఆశించిన స్థాయి దక్కలేదు కానీ.. ఓటీటీ లో మాత్రం మంచి టాక్ సంపాదించుకుంది.

7. క్రాక్:

ముంబైలోని మురికివాడల నుండి అండర్‌గ్రౌండ్ ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ ప్రపంచానికి ప్రయాణం చేసిన ఈ వ్యక్తి కథే ఈ సినిమా. ఈ సినిమా కూడా ప్రస్తుతం హాట్ స్టార్ లో మంచి వ్యూవర్ షిప్ దక్కించుకుంది.

8. ప్రేమలు :

తెలుగులో మళ్ళీ మలయాళ సినిమాల మ్యాజిక్ ఈ సినిమాతో స్టార్ట్ అయిందేమో అన్నంతలా.. ఈ సినిమా గురించి బాగా బజ్ నడిచింది. ఇక ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా విడుదలయ్యి.. చాలా డేస్ గడిచిన కానీ ఇంకా ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

9. 12th ఫెయిల్:

ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శుక్లా జీవితంపై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పి తీరాలి. ఈ సినిమా కూడా హాట్ స్టార్ లో ట్రెండింగ్స్ లో భాగంగా నిలిచింది.

10. పాట్నా శుక్ల :

తన్వీ శుక్లా అనే ఓ ఓ సాధరణ హౌజ్ వైఫ్ ఓ సమర్ధవంతమైన లాయర్ గా ఎలా ఎదిగింది. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తున్న మార్పులకు విరుద్ధంగా ఎలా పోరాడింది అనేదే ఈ సినిమా కథ.

మరి ఇప్పటివరకు ట్రేండింగ్ లో ఉన్న ఈ సినిమాలను మీరు మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet Girişcasibom girişHoliganbet GirişOnwin GirişBetturkey girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel