iDreamPost
android-app
ios-app

OTTలో మంజుమ్మేల్ బాయ్స్‌ని మించిన మూవీ.. అనుక్షణం ఉత్కంఠ

  • Published May 14, 2024 | 5:21 PM Updated Updated May 14, 2024 | 5:21 PM

మంజుమ్మేల్ బాయ్స్ సినిమా చూసే ఉంటారు. ఒక భారీ లోతైన గుహలో పడిపోయిన వ్యక్తి ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు.. ఫ్రెండ్స్ ఎలా తనను రక్షించుకోగలిగారు అనే కథాంశంతో తెరకెక్కింది. అచ్చం ఇలాంటి సినిమానే దీని కంటే ముందే వచ్చింది. ఆ మూవీ కూడా ఓ వ్యక్తి జీవితంలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కింది.

మంజుమ్మేల్ బాయ్స్ సినిమా చూసే ఉంటారు. ఒక భారీ లోతైన గుహలో పడిపోయిన వ్యక్తి ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు.. ఫ్రెండ్స్ ఎలా తనను రక్షించుకోగలిగారు అనే కథాంశంతో తెరకెక్కింది. అచ్చం ఇలాంటి సినిమానే దీని కంటే ముందే వచ్చింది. ఆ మూవీ కూడా ఓ వ్యక్తి జీవితంలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కింది.

OTTలో మంజుమ్మేల్ బాయ్స్‌ని మించిన మూవీ.. అనుక్షణం ఉత్కంఠ

రీసెంట్ గా వచ్చిన మంజుమ్మేల్ బాయ్స్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో ఫ్రెండ్స్ అందరూ సరదాగా గుణ గుహల దగ్గరకి వెళ్తే.. ఆ గుహలో ఫ్రెండ్ పడిపోతే మరో ఫ్రెండ్ రక్షిస్తాడు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక పెద్ద లోయలో పడిపోయిన హీరో తనకు తానుగా బయటపడతాడు. దాదాపు 5 రోజుల పాటు ఆ లోయలోనే గడుపుతాడు. చివరికి ఎలా వచ్చాడు అన్నదే కథ. ఆధ్యంతం సినిమా చాలా ఉత్కంఠగా సాగుతుంది. 

లోయలో ఎలా పడిపోతాడంటే?:

ఇది అరన్ రాల్స్టన్ అనే వ్యక్తి కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా. ఇతనో పర్వతారోహకుడు. అడ్వెంచర్స్ అంటే మహా సరదా. ఇతని కథ ఆధారంగా తెరకెక్కిందే 127 హవర్స్. 2003లో జరిగిన ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీశారు. జేమ్స్ ఫ్రాన్స్ కో అనే నటుడు ఈ సినిమాలో రాల్స్టన్ పాత్రలో నటించాడు. డానీ బోయ్లే దీన్ని తెరకెక్కించాడు. విచిత్రం ఏంటంటే.. ఈ సినిమాలో తెరకెక్కించిన ప్రతీ సీన్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా? అని రాల్స్టన్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ని మ్యాచ్ అవుతుందా లేదా అని ఆ వ్యక్తి పర్యవేక్షణలో తెరకెక్కించారు. ఇక కథలోకి వెళ్తే జేమ్స్ ఫ్రాన్స్ కో అడ్వెంచర్ అంటే ఇష్టం కాబట్టి ఇంట్లోంచి బయలుదేరతాడు. అలా వెళ్తుండగా ఒక చోట ప్లేస్ బాగుందని ఆగుతాడు. అక్కడ అటూ ఇటూ విడిపోయి ఉన్న రెండు కొండల మీద బండరాయి ఉంటుంది. దాని మీదకు ఎక్కితే బరువు కాస్తుందా లేదా అని ఎక్కుతాడు. అంతే ఒక్కసారిగా లోయలో పడిపోతాడు. తనతో పాటు ఆ రాయి కూడా పడిపోతుంది. అదృష్టమో, దురదృష్టమో తెలీదు గానీ ఆ రాయి హీరో చేతి మీద పడుతుంది. అంతే బండరాయి మధ్యలో చేయి ఇరుక్కుపోతుంది. తినడానికి ఏమీ లేవు. ఒక వాటర్ బాటిల్ ఉంటుంది. లోయ చూస్తే చాలా లోతులో ఉన్నాడు. సహాయం చేయడానికి అక్కడకు ఎవరూ రారు. 

చివరికి ఇలా బయటపడతాడు:

5 రోజుల 7 గంటల పాటు ప్రయత్నించి చివరకు బయటపడతాడు. ఈ క్రమంలో తన చేయిని నరుక్కుంటాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. సింగిల్ క్యారెక్టర్ చుట్టూ సినిమాని నడిపించేశారు. మధ్యలో ఇద్దరు అమ్మాయిలు వచ్చి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల క్యారెక్టర్స్ చూపిస్తారు. అంతే మిగతా సీన్స్ అన్నీ సోలో క్యారెక్టర్ మీద నడిపించేశారు. అంత లోతైన ప్రదేశం నుంచి బండరాయికి, కొండకు మధ్యలో చేయి ఇరుక్కుపోతే ఎలా బయటపడ్డాడు అనేది ఆధ్యంతం ఉత్కంఠ కలిగిస్తుంది. ఈ మూవీ పేరు 127 హవర్స్. డిస్నీ+ హాట్ స్టార్, డిస్నీ+, మ్యాక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఉన్నాయి. యాపిల్ టీవీ, గూగుల్ ప్లే మూవీస్ లో కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రెంట్ కి ఉంది. ఈ సినిమా చూస్తే మంజుమ్మేల్ బాయ్స్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది.