P Krishna
Coimbatore News: సాధారణంగా ప్రతి ఇంట్లో ఉదయం లేవగానే ఇల్లూ,వాకిలి శుభ్రం చేసుకోవడం అలవాటు. ఇంట్లో చెత్త ఉంటే అరిష్టం అని అంటుంటారు. అందుకే ఇళ్లు ప్రతిరోజూ మనం ఉండే చోటును ఎంతో శుభ్రం చేసుకుంటాం.
Coimbatore News: సాధారణంగా ప్రతి ఇంట్లో ఉదయం లేవగానే ఇల్లూ,వాకిలి శుభ్రం చేసుకోవడం అలవాటు. ఇంట్లో చెత్త ఉంటే అరిష్టం అని అంటుంటారు. అందుకే ఇళ్లు ప్రతిరోజూ మనం ఉండే చోటును ఎంతో శుభ్రం చేసుకుంటాం.
P Krishna
ఇల్లును చూసి ఇల్లాల్ని చూడాలని మన పెద్దలు అన్నారు.. ఈ సామెత ఊరికే అనలేదు. ఇంటిని పరిశ్రభంగా ఉంచే చోట లక్ష్మీ దేవి కొలువై ఉంటుందని అంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లాలు తమ రోజువారీ కార్యక్రమాలను మొదట ఇల్లు శుభ్రం చేయడంతోనే మొదలు పెడతారు.. అలాంటి ఇంటిలో లక్ష్మీ తాండవం చేస్తుందని పెద్దలు అంటారు. ఇంట్లో అయినా ఆఫీస్ లో అయినా చెత్త ఉంటే చీకాకు..చూసే వారికి అసహ్యంగా ఉంటుంది. అందుకే ఇల్లు, కార్యాలయాల్లో ఎప్పటికప్పుడు చెత్త క్లీన్ చేస్తూ శుభ్రంగా ఉంచుతారు. అలాంటిది తమిళనాడులో ఓ సంఘటన అందరినీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఓ ఇంట్లో చెత్త చూసి ప్రతి ఒక్కరూ షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళితే..
తమిళనాడులో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో 4 వేల కిలోల చెత్త చూసి జనాలకు మైండ్ బ్లాక్ అయ్యింది. విచిత్రం ఏంటంటే అదే చెత్తలో తల్లీ కూతుళ్లు కొన్ని ఏళ్లుగా జీవిస్తున్న విషయం తెలుసుకొని దిగ్బ్రాంతికి గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో రుక్మిణి, ఆమె భర్త, కూతురు నివసించేవారు. రుక్మిణి భర్త ప్రభుత్వ టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. భర్త చనిపోతే బంధువులు ఎవరూ రాలేదు..దాంతో రుక్మిణి ఆమె కూతురు మానసికంగా కుంగిపోయారు. అవమాన భారంతో ఇంటి నుంచి బయటకు రావడం మానేశారు. రుక్మిణికి భర్త పెన్షన్ వస్తుంది..అదే వాళ్లకు ఆధారం. ప్రతిరోజూ ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకునేవారు.. ఎప్పుడో వంట చేసుకొని తినేవారు. వ్యర్థాలను బయట పడేయకుండా ఇంట్లోనే వేసేవారు. అలా ఇల్లంతా చెత్తతో పేరుకుపోయింది. అలా ఆ చెత్త ఏకంగా 4 టన్నుల వరకు పేరుకుపోయింది. అయినా ఏనాడు ఇంటిని శుభ్రం చేయలేదు.
ఈ విషయం ఇరుగు పోరుగువారు ఓ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులకు తెలియజేశారు. వారు ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంట్లోకి ప్రవేశించగలిగారు.అప్పుడు ఇళ్లు చూసి ఒక్కసారే షాక్ కి గురయ్యారు. అక్కడ వచ్చే దుర్గంధం భరించలేకపోయారు.. ఓ చిన్నపాటి డంపింగ్ యార్డులా కనిపించింది. ఇంటి లోపలి దృశ్యాలను వీడియో తీసి దాన్ని మున్సిపల్ అధికారులకు పంపించారు. దాంతో వారు వెంటనే స్పందించి తమ సిబ్బందిని పంపించి ఆ ఇంటి నుంచి దాదాపు 4 వేల కిలోల చెత్తను వాహనాల్లో డంపింగ్ యార్డ్ కి తరలించారు. ఇంటిని శుభ్రం చేయించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
வீடா? குப்பை காடா ? திகில் கிளப்பும் வீட்டில் பல வருடங்களாக அகற்றப்படாத குப்பைக்கு மத்தியில் தாயுடன் வசித்து வரும் மகள்.. ஆன்லைனில் உணவு ஆர்டர் செய்து சாப்பிட்டு வாழ்ந்து வரும் பெண்களால் அச்சத்தில் ஆழ்ந்த அக்கம்பக்கத்தினர்…! #Coimbatore | #Garbage | #OnlineFood |… pic.twitter.com/MYBGVEVOEr
— Polimer News (@polimernews) July 20, 2024