iDreamPost
android-app
ios-app

చంద్రబాబుకు షాక్‌ ఇచ్చిన మరో ఆరుగురు ఎమ్మెల్సీలు.. టీడీఎల్పీలో కీలక నిర్ణయం..

చంద్రబాబుకు షాక్‌ ఇచ్చిన మరో ఆరుగురు ఎమ్మెల్సీలు.. టీడీఎల్పీలో కీలక నిర్ణయం..

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబుకు ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఆరుగురు షాక్‌ ఇచ్చారు. సోమవారం శాసన సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం నిర్వహించిన టీడీఎల్పీ భేటీకి ఆరుగురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. ఎమ్మెల్సీలు అందరూ తప్పని సరిగా హాజరుకావాలని స్వయంగా చంద్రబాబే ఫోన్‌ చేసి మాట్లాడినా కూడా ఆరుగురు ఎమ్మెల్సీలు సమావేశానికి గౌర్హాజరవడంతో చంద్రబాబుతోపాటు పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది.

Read Also: మండ‌లికి మంగ‌ళం.. 13 ఏళ్లకే ముగిసిన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్సీలు గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల విజయరామరాజు, ఏఎస్‌ రామకృష్ణ, శమంతకమణిలు సమావేశానికి హాజరు కాలేదు. మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును శాసన మండలిలో టీడీపీ అడ్డుకోవడంతో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీకి దూరమయ్యారు. డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఎమ్మెల్సీ పదవికే రాజీనామా చేయగా, పోతుల సునీత, శివనాథరెడ్డిలు టీడీపీని వీడారు.

Read Also: రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు బ్రేక్ – అనుకున్నది సాధించిన టీడీపీ

కాగా శాసన మండలిపై శాసన సభలో జరిగే చర్చకు హాజరు కాకూడదని టీడీఎల్పీ నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుతో సుదీర్ఘంగా చర్చించిన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక సభ గురించి మరొక సభలో చర్చించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇలాంటి చర్చలో తాము భాగం కాకుడదంటూ టీడీపీ నిర్ణయించింది.