iDreamPost
android-app
ios-app

కియాపై వదంతులకు ఫుల్‌స్టాప్‌.. మంత్రి మేకపాటి.. కియా జీఎం భేటీ..

కియాపై వదంతులకు ఫుల్‌స్టాప్‌.. మంత్రి మేకపాటి..  కియా జీఎం భేటీ..

అనతంపురంలో ఏర్పాటైన కియా కార్ల తయారీ కంపెనీ తమిళనాడుకు తరలిపోతోంది. రాయిటర్‌ కథనం రాసింది. ఇకేముంది అంతా అయిపోయింది. మేము కష్టపడి తెచ్చిన కియాను తరిమేస్తున్నారు. జగన్‌ అధికారంలోకి రావడంతోనే వారికి కష్టాలు మొదలయ్యాయి. పంజాబ్‌ వాళ్లు కియా ను రమ్మంటున్నారు. రాష్ట్రానికి బ్యాడ్‌ టైం మొదలైంది… నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు మీడియాలోని ఓ వర్గం, టీడీపీ అధినేత చంద్రబాబు.. గల్లీ నుంచి ఢిల్లీలోని లోక్‌సభ వరకు ఇదే తంతు నడిపారు. రాయిటర్‌ కథనాన్ని ఖండిస్తూ.. కియా క్లారిటీ ఇచ్చినా.. ప్రభుత్వం ప్రకటన చేసినా.. ఇవి ఆగలేదు.

Read Also: కియా ఆంధ్రాను వీడదు.. ఎందుకంటే.. ?

తాజాగా కియాపై జరుగుతున్న వదంతులకు పూర్తి స్థాయిలో ఫుల్‌ స్టాఫ్‌ పడేలా.. ఈ రోజు ఉత్తర ప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఓ ఘటన చేటుచేసుకుంది. లక్నోలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పోకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హాజరయ్యారు. అదే కార్యక్రమానికి కియా మార్కెటింగ్‌ జనరల్‌ మేనేజర్‌ సన్‌ హూక్‌ హ్యాంగ్‌ కూడా హారయ్యారు.

Read Also: కియా కథనంపై అర్ధరాత్రి నుంచే పక్కా ప్లాన్‌

ఈ సందర్భంగా కియా మార్కెట్‌ జీఎం, మంత్రి మేకపాటి భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య నిన్న జరిగిన వందంతులు ప్రస్తావనకు వచ్చాయి. కియా ఎక్కడికీ పోదని, ఏపీలో మరింతగా వృద్ధి సాధిస్తుందని వారిద్దరూ పరస్పరం భరోసా ఇచ్చుకున్నారు. ఈ విషయం మంత్రి మేకపాటి తన ట్వీట్టర్‌ వేదికగా తెలియజేశారు. సన్‌ హూక్‌ హ్యాంగ్‌ తో ఉన్న ఫొటోలను ట్యాగ్‌ చేశారు. ఈ పరిణామం తర్వాతైనా.. బాబు అండ్‌ కో కియాపై చేస్తున్న దుష్ప్రచారం ఆపుతుందా..? లేదా..? వేచి చూడాలి.