iDreamPost
android-app
ios-app

జలుబుతో అధికారిక కార్యక్రమాలకు మంత్రి.. అనుచరుల్లో ఆందోళన

జలుబుతో అధికారిక కార్యక్రమాలకు మంత్రి..  అనుచరుల్లో ఆందోళన

కరోనా వైరస్ నేపథ్యంలో ఎవరైనా దగ్గినా, తుమ్మినా భయపడాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. జలుబు, దగ్గు కరోనా వైరస్ లక్షణాలు కావడమే ఇందుకు కారణం. సాధారణ ప్రజలే కాదు.. ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు దగ్గినా తుమ్మినా వారి ఆరోగ్యంపై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఇలాంటి పుకార్ల బారినపడ్డారు.

నిన్న సోమవారం సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆ సమయంలో ఆయన జలుబు తో ఇబ్బంది పడ్డారు. మంత్రి ఇబ్బందిని గమనించిన అనుచరులు, సన్నిహితులు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం కాస్త మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో తాజాగా ఈ రోజు ఆయన స్పందించారు. తన ఆరోగ్యం విషయమై సోమవారం నుంచి కొంతమంది ఆందోళన చెందుతున్నారని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. నా ఆరోగ్యం పై ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. తన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని స్పష్టం చేశారు.

సిరిసిల్లలో పర్యటిస్తున్న సందర్భంగా సోమవారం ఎన్నో సంవత్సరాల నుంచి తనకు సంబంధించిన ఎలర్జీ వచ్చిందని కేటీఆర్ వెల్లడించారు. అయితే తన పర్యటనకు సంబంధించిన పలు కార్యక్రమాలు అప్పటికే సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అందరికీ ఇబ్బంది కలుగుతుందని ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని కొనసాగించాల్సి వచ్చిందని వివరించారు.