iDreamPost
android-app
ios-app

జన సైనికుడి పాడె మోసిన మంత్రి, మాజీ మంత్రి…

జన సైనికుడి పాడె మోసిన మంత్రి, మాజీ మంత్రి…

మచిలీపట్నం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దాసరి లక్ష్మణ రావు గుండెపోటుతో మృతి చెందారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో లక్ష్మణ రావును హాస్పిటల్ కు తరలించినా ప్రయోజనం లేక పోయింది. దీంతో మచిలీపట్నం పవన్ కళ్యాణ్ అభిమానుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

కానీ రాజకీయాలకు అతీతంగా దాసరి లక్ష్మణ రావు అంతిమ యాత్రలో ఇద్దరు వేరు వేరు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది.. నిత్యం సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకునే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ప్రస్తుత మంత్రి పేర్ని నాని లక్ష్మణ రావు అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు.

నిత్యం ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ, ఆరోపణలు ప్రత్యారోపణలతో గ్రామాల్లో వర్గాలుగా విడిపోయి,రాజకీయ వైషమ్యాలతో నిత్యం తగువులాడుకునే ఈ రోజుల్లో పార్టీలకి అతీతంగా

ఈ విషాద ఘటనలో పాల్గొని తమ నివాళులు అర్పించడంతో పాటు, మరణించిన వ్యక్తి పాడెను ఇరుపార్టీలకు చెందిన కీలక నేతలు మోయడంతో రాజకీయ రణరంగంలో మాత్రమే ప్రత్యర్థులమని, మానవీయ కోణంలో తాము మాత్రం మిత్రులమనే సందేశాన్ని చాటి చెప్పినట్లయింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom