iDreamPost
android-app
ios-app

చిరు ‘మెగా’ యాక్టివ్ అయ్యారే

  • Published Mar 26, 2020 | 2:25 PM Updated Updated Mar 26, 2020 | 2:25 PM
  • Published Mar 26, 2020 | 2:25 PMUpdated Mar 26, 2020 | 2:25 PM
చిరు ‘మెగా’ యాక్టివ్ అయ్యారే

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీ గ్రాండ్ గా అయ్యిందనే చెప్పాలి. ఇప్పటికే టాలీవుడ్ తో పాటు తమిళ, మలయాళం నుంచి కూడా సెలబ్రిటీలు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ ట్వీట్లు పెడుతున్నారు. దానికి ఓపిగ్గా చిరు కూడా సమాధానం ఇస్తూ హుషారు నింపుతున్నారు. ఇప్పటిదాకా ట్విట్టర్ లో కానీ ఏ ప్లాట్ ఫార్మ్ మీద లేని చిరు ఇప్పుడు ఇంత యాక్టివ్ గా మారిపోవడం పట్ల ఫాన్స్ కూడా మంచి ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లోనే ఉండటం వల్ల కావొచ్చు స్టార్టింగ్ కాబట్టి అందరిని ట్యూన్ చేసుకుందాం అనుకున్న కారణం కావొచ్చు ఏదైతేనేం తాను ఇక్కడా బాసే అని నిరూపిస్తున్నారు చిరు.

ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ గురించి చిరంజీవి చేసిన ట్వీట్ కి జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. మీరు చెప్పారంటే అది చాలా పెద్ద మాటని చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు. మహేష్ బాబు సింగల్ లైన్ లో ఆహ్వానం పలికితే దానికి చిరు ప్రిన్స్ చెప్పిన 6 సూత్రాల హెల్త్ గైడ్ లైన్స్ గురించి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు . సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్, నీహారిక ఇలా మెగా కాంపౌండ్ లోని మెజారిటీ విష్ చేసేశారు . పక్క రాష్ట్రాల నుంచి సుహాసిని మణిరత్నం, ఖుష్బూ సుందర్, మోహన్ లాల్ తదితరులు మెసేజ్ పెట్టారు. దర్శకుల్లో వివి వినాయక్, కొరటాల శివ తదితరులు శుభాకాంక్షలు తెలిపి రిప్లై కూడా తెచ్చేసుకున్నారు.

ఇదిలా ఉండగా అన్నింటి కన్నా హై లైట్ అయ్యింది చిరు-పూరి జగన్నాధ్ మధ్య జరిగిన ట్వీట్స్. బాస్ కు స్వాగతం చెబుతూ పూరి చేసిన ట్వీట్ కి చిరు బదులు ఇస్తూ బ్యాంకాక్, ముంబై బీచులు గుర్తుకు రాకుండా ఇంట్లోనే పిల్లలు పవిత్ర, ఆకాష్ లతో ఎక్కువ సమయం గడిపే ఛాన్స్ దొరికిందని ఎంజాయ్ చేయమని చెప్పారు. ఇంకేముంది నెటిజెన్లు బాస్ భలే చురుగ్గా స్వీట్ ట్విస్ట్ ఇచ్చాడుగా అంటూ కామెంట్లు చేశారు. దానికి మళ్ళీ స్పందించిన పూరి లవ్ యు అన్నయ్య అని చెప్పి ముగించాడు.

పాత సినిమాలోని చిన్న వీడియో ఎక్స్ ప్రెషన్ తో విక్టరీ వెంకటేష్, ఈ ప్రపంచంలోకి రమ్మని స్వాగతం చెబుతూ నాగార్జున ఇలా చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ మెగాస్టార్ కు వార్మ్ వెల్కమ్ చెప్పడం గమనార్హం. మొత్తానికి తాను ఊరికే పోస్టర్లు ఫస్ట్ లుక్ లు మాత్రమే కాకుండా రెగ్యులర్ టచ్ లో ఉండాలనే ఉద్దేశంతోనే ట్విట్టర్ లోకి వచ్చినట్టు మెగాస్టార్ చెప్పకనే చెప్పారు. అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఆచార్య లుక్ కానీ ఎలాంటి న్యూస్ కానీ పెట్టకపోవడం ఫ్యాన్స్ కు కొంత నిరాశ కలిగించినా మొత్తానికి కొత్త జోష్ అయితే నింపాడు బాస్.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio