iDreamPost
android-app
ios-app

Tollywood Movies: రెండు సినిమాలు..రెండు ట్విస్ట్ లు!

తెలుగు సినిమా అంటే ఓ ఎత్తుగడ..మాంచి ఎలివేషన్ తో హీరో ఇంట్రడక్షన్..

తెలుగు సినిమా అంటే ఓ ఎత్తుగడ..మాంచి ఎలివేషన్ తో హీరో ఇంట్రడక్షన్..

Tollywood Movies: రెండు సినిమాలు..రెండు ట్విస్ట్ లు!

తెలుగు సినిమా అంటే ఓ ఎత్తుగడ..మాంచి ఎలివేషన్ తో హీరో ఇంట్రడక్షన్..అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్..ప్రీ క్లయిమాక్స్ ముందు ఐటమ్ సాంగ్.. భారీ క్లయిమాక్స్. ఇది ఒక పాట్రన్. మూడు వంతుల సినిమాలు దీన్నే ఫాలో అవుతూ వుంటాయి. అయితే ఈ మధ్య ఊహించని ట్విస్ట్ అన్నది సినిమాలకు పెద్ద థింకింగ్ పాయింట్ అయిపోయింది. రాను రాను అది షాకింగ్ ట్విస్ట్ గా టర్న్ అవుతోంది.

జూలై నెలలో చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. వీటిలో రెండు సినిమాల్లో షాకింగ్ ట్విస్ట్ లు వుంటాయని గ్యాసిప్ లు చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి అలాంటి షాకింగ్ కాదంట. ఊహించలేనివి. కానీ గమ్మత్తేమిటంటే ఆ ఊహించలేనివి ఇవే అంటూ గ్యాసిప్ లు చక్కర్లు కొట్టడం. ఒక సినిమాలో హీరోయిన్ కు సంబంధించిన షాకింగ్ ట్విస్ట్..రెండో సినిమాలో హీరోకి సంబంధించిన షాకింగ్ ట్విస్ట్ వుంటాయని తెలుస్తోంది.

ఇంకా షాకింగ్ ఏమిటంటే ఈ రెండు గ్యాసిప్ లూ చావుల చుట్టూ తిరగడం. దీంతో జూలైలో విడుదల అవుతున్న సినిమాలు ఏమిటి? వాటిలో ఈ రెండు సినిమాలు ఏవై వుంటాయి. వాటిల్లో ఏ సినిమాలో ఎవరికి ట్విస్ట్ అనే డిస్కషన్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆ విధంగా ఆ సినిమాల మీద ఆసక్తి పెరుగుతూ వస్తోంది.

అయితే కేవలం ట్విస్ట్ లతో సినిమాలు ఆడవు. ఆ ట్విస్ట్ ల చుట్టూ అల్లుకున్న కథ, ఆ ట్విస్ట్ లకు వరకు దారితీసే కథనం, ఆ ట్విస్ట్ లు ఇచ్చే షాకింగ్ విధానం ఇవన్నీ కలిసి సినిమాను హిట్ బాట పట్టిస్తాయి. జూలై సినిమాలు అన్నీ విడుదలైతే ఆ సినిమాలేంటీ, ఆ షాక్ లేంటీ, ఎలా వచ్చాయి అన్న క్లారిటీ వస్తుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet