సువాసన లేని పుష్పము అని వెనకటికి ఓ మాట వుంది. పువ్వు ఎంత అందంగా వున్నా, సువాసన లేకపోతే ఏం ప్రయోజనం? సినిమా కూడా ఇలాంటిదే. ఎంత గ్రాండియర్ గా వున్నా, ఎంత విజువల్స్ అద్భుతంగా వున్నా, విషయం సక్రమంగా చెప్పలేకపోతే ప్రయోజనం ఏమిటి?
సువాసన లేని పుష్పము అని వెనకటికి ఓ మాట వుంది. పువ్వు ఎంత అందంగా వున్నా, సువాసన లేకపోతే ఏం ప్రయోజనం? సినిమా కూడా ఇలాంటిదే. ఎంత గ్రాండియర్ గా వున్నా, ఎంత విజువల్స్ అద్భుతంగా వున్నా, విషయం సక్రమంగా చెప్పలేకపోతే ప్రయోజనం ఏమిటి?
వి రాజా
సువాసన లేని పుష్పము అని వెనకటికి ఓ మాట వుంది. పువ్వు ఎంత అందంగా వున్నా, సువాసన లేకపోతే ఏం ప్రయోజనం? సినిమా కూడా ఇలాంటిదే. ఎంత గ్రాండియర్ గా వున్నా, ఎంత విజువల్స్ అద్భుతంగా వున్నా, విషయం సక్రమంగా చెప్పలేకపోతే ప్రయోజనం ఏమిటి? అభిషేక్ నామా దర్శకత్వంలో వచ్చిన నాగబంధం సినిమా వ్యవహారం ఇలాగే వుంది. విరాట్ కర్ణ..నభా నటేష్ తదితరులు నటించిన ఈ ఫాంటసీ టచ్ సినిమా కోసం కోట్లు ఖర్చు చేసేసినట్లు తెరపై విజువల్స్ చూస్తుంటే అర్థం అవుతూ వుంటుంది. కానీ కోట్లలో కాసిన్ని నోట్లు సరైన స్క్రిప్ట్ తయారీకి, ఎగ్జిక్యూషన్ కు కూడా ఖర్చు చేసి వుంటే బాగుండేది కదా అని సినిమా చూసాక అనిపిస్తుంది.
భారీ వ్యయంతో నిర్మించిన నాగబంధం సినిమా కథేంటీ అంటే…చటుక్కున వివరంగా చెప్పడం కష్టం. వన్ లైన్ లో చెప్పాలంటే మనిషి విశ్వాన్ని జయించడానికి పనికివచ్చే ఓ బ్రహ్మకమలం కోసం ఆరాటపడిన విలనుడి కథ. దాన్ని కాపాడిన హీరో కథ. ఈ కథ ఎప్పుడో నెహ్రూ ప్రధానిగా వున్న కాలం నుంచి మొదలై, ప్రస్తుత కాలానికి వచ్చి, పరాయి పాలకుులు ఇండియా మీద దండెత్తిన కాలానికి వెళ్లి వస్తుంది. ఇలా అటు ఇటు..ఇటు అటు తిరుగుతూ వుంటుంది. ఈ మధ్యలో బోలెడు సన్నివేశాలు, రక్తపాతాలు, అరుపులు, కేకలు.
అనంత పద్మనాభస్వామి నేల మాళిగలో నిధులు వున్నాయనే వార్తల నేపథ్యంలో రాసుకున్న కథ. శ్రీరంగనాధస్వామి ఆలయంలోని దేవుని విగ్రహంలో వున్న బ్రహ్మ కమలానికి, హిమాలయాల్లో రహస్యంగా వున్న విరాట్ స్వరూపుడి ఆలయానికి కనెక్షన్ వుంటుంది. ఈ పూవు, దానితో పాటు తాంత్రిక మంత్రాల గ్రంధం వుంటే ఆ గుడికి వున్న నాగబంధం వీడుతుంది. ఈ బ్రహ్మ కమలం దగ్గర వుంటే విశ్వాన్ని శాసించవచ్చు. దాని కోసం ఎన్నో దశాబ్దాలుగా ముష్కరులు ప్రయత్నిస్తూనే వున్నారు. ఈ సినిమా కథ అదే.
నాగబంధం సినిమాకు తొలి సమస్య. స్క్రీన్ ప్లే. ఈ కథను ఓ వరుసలో ఎలా చెప్పాలి..ఎంత. మేరకు చెప్పాలి అన్న విషయంలో దర్శకుడు అభిషేక్ నామా పూర్తిగా తడబడ్డాడు. అతని అనుభవం సరిపోలేదు. కథ చెప్పడంలో మాత్రమే కాదు. నటీనటుల నుంచి నటన రాబట్టుకోవడంలో లేదా వాళ్ల చేత నటింపచేయడంలో కూడా. ఎందుకో విలన్ అంటే వికటాట్టహాసం చేయాలి. ఫస్ట్రేషన్ వస్తే భయంకరంగా అరవాలి అనే ట్రెండ్ లో వుండిపోయాడు దర్శకుడు. మితిమీరిన వికటాట్టహాసాలు, అరుపులు సినిమా చివరకు వచ్చేసరికి చికాకు తెప్పిస్తాయి.
సినిమా ఆరంభం ప్రామిసింగ్ గా వుంటుంది. మంచి విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఆ తరువాత సినిమా శ్రీరంగనాధస్వామి ఆలయం, ఉత్సవాలు అన్నింటి మీదుగా వెళ్తున్నపుడు కూడా బాగానే వుంటుంది. ఆ సెట్ లు, విజవల్స్, గ్రాఫిక్స్ వర్క్స్ అన్నీ బాగుంటాయి. వాటికి అప్పటి వరకు అందించిన నేపథ్యసంగీతం కూడా బాగానే వుంటుంది. కానీ ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి టార్చర్ మొదలవుతుంది. హీరో ఫ్యామిలీ వ్యవహారాలు అసలు కథలో అతకవు. బోరింగ్ గా అనిపిస్తాయి. ఆ తరువాత ఇంటర్వెల్ బ్యాంగ్ లో చూపించిన ఊచకోత అప్పటి వరకు సినిమా మీద వున్న అంతో ఇంతో సాఫ్ట్ కార్నర్ ను పూర్తిగా తుడిచేస్తుంది. ఈ రక్తపాతం ఎంత సేపు వుంటుంది అనే భావన కలుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వద్ద రాసుకున్న ట్విస్ట్ ను జనాలు షాక్ అయ్యే రేంజ్ లో చిత్రీకరించలేకపోయారు. అంత సాదా సీదాగా వెళ్లిపోతుంది ఆ ట్విస్ట్. తొలిసగంలో మొదటి పాట వరకు బాగుంటుంది. కానీ ఆ తరువాత రెండు పాటలు వెంటవెంటనే వచ్చి సినిమా నడకను పక్కకు లాగేస్తాయి
విశ్రాంతి తరువాత నుంచి ఇక సినిమా అలా కిందకు జారిపోతూనే వుంటుంది. అప్పటి వరకు కాస్త ఆకట్టుకున్న విజవల్స్ కూడా ఆకట్టుకోవు. సినిమా వెనక్కు, ముందుకు వెళ్తుంటుంది. ఈ సీన్లు ఆ సీన్లు కలగలిసి కిందా మీదా పడేలా చేస్తాయి. ముందు అంతా, బ్రహ్మకమలం వుంటే చాలు విశ్వాన్ని జయించవచ్చు అని చెబుతూ వస్తారు. తరువాత ఆ బ్రహ్మకమలం, మంత్రాల పుస్తకం అండతో విరాట్ స్వరూపుడి ఆలయాన్ని తెరవాలి అని చూస్తారు. అసలు ఎందుకు తెరవడం అనే దానికి ఆన్సర్ చెప్పకపోగా, దానికి పార్ట్2 లో చూడండి అంటూ ఓ అనౌన్స్ మెంట్ కూడానూ. క్లయిమాక్స్ పేరిట దాదాపు నలభై నిమిషాల పాటు ఒకటే నరమేధం.
పిల్లలూ, పెద్దలూ చూడాల్సిన సబ్జెక్ట్, దేవుడు, హిందూ మతం మంచి విషయాలు సినిమా నిండా వున్నపుడు అంత హింస, ఆ రక్తపాతం ఎందుకు? మళ్లీ మధ్యలో ఐటమ్ వ్యవహారాలు, ఆడవాళ్ల మీద దౌర్జన్యాలు ఎందుకు? అసలు సినిమా స్క్రిప్ట్ లోనే లోపం వుంది. ఎక్కడ ఎంత వరకు సన్నివేశాలు రాసుకోవాలో, తీసుకోవాలో, ఎక్కడ ఎంత వరకు లేపేయాలో దర్శకుడికి తెలియలేదనే అనుకోవాలి. ఎడిటర్ కత్తెరకు ఇంకా చాలా చాలా పదును వుండాలి. అది కూడా సినిమాకు మైనస్ గా మారింది.
సినిమా బాగుంటే ఎంత సినిమా అయినా చూడగలరు ప్రేక్షకులు. బాగాలేకుండా ఎప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది. నాగబంధం సినిమా విషయంలో ఇది చోటు చేసుకుంది. డైలాగులు ఫోర్స్ డ్ గా, కావాలని చొప్పించినట్లు వున్నాయి తప్ప ఫీల్ లేదు. విషయం కొత్తది కాదు. విషయం చెప్పడంలో క్లారిటీ మిస్ అయింది. దానికి తోడు ఈ ఫోర్స్ డ్ సన్నివేశాలు. రక్తపాతాలు, అడ్డం పడే పాటలు, అన్నీ కలిసి నాగబంధం సినిమాను గాడితప్పించేసాయి. ఈ సినిమా చూడడం వల్ల ప్రేక్షకుడికి డబ్బుల నష్టం సంగతి కన్నా, నిర్మాతకు ఈ సినిమాను ఇలా తీయడం అన్నది వేస్ట్ ఆఫ్ మనీ అనుకోవాలి.