iDreamPost
android-app
ios-app

Yash Toxic: టాక్సిక్ – వేడి పెంచే ప్రయత్నం

టాక్సిక్ - వేడి పెంచే ప్రయత్నం

టాక్సిక్ - వేడి పెంచే ప్రయత్నం

Yash Toxic: టాక్సిక్ – వేడి పెంచే ప్రయత్నం

కన్నడ హీరో యష్ లేటెస్ట్ భారీ సినిమా టాక్సిక్. ఎప్పటి నుంచో ఊరిస్తోంది థియేటర్లకు రాకుండా. ఇప్పుడు మెల్లగా పబ్లిసిటీ వేడి పెంచుతోంది. టాక్సిక్ మొదటి టీజర్ నే హాట్ కాదు హాటెస్ట్ అన్నట్లు వచ్చింది. కుర్రకారు ఊగిపోయారు. ఆ తరువాత సరైన కంటెంట్ మళ్లీ టాక్సిక్ నుంచి రాలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా లేడీస్ అండ్ లేడీస్ అంటూ ఓ టీజర్ లాంటి కంటెంట్ ను వదిలారు. ఇది ఫుల్ యూత్ ఫుల్ గా వుంది.

గమ్మత్తేమిటంటే పిల్లలు..తండ్రులు..తాతలు..అందరికీ చూడొద్దు అంటూ హెచ్చరిక ఇచ్చి ఈ విడియోను స్టార్ట్ చేసారు. ఒక్కో హాట్ హీరోయిన్ ను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్లారు. నయనతార, కియరా అద్వానీ..తార సతారియా..రుక్మిణీ వసంత్ ఇలా అందరినీ వీలయినంత గ్లామరస్ గా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేసారు. వీళ్లందరి యాక్షన్ కట్ లు..ఆ తరువాత ఒక్కొక్కరు కాదు.అందరూ కలిసి రండి..నేను రెడీ అనే యష్ ను చూపించి, యాక్షన్ బిట్ తో విడియోను క్లోజ్ చేసారు.

చూస్తుంటే యూత్ ఫుల్ కంటెంట్, గ్లామరస్ కంటెంట్ తో టాక్సిక్ మీద హీట్ ను పెంచాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. టాక్సిక్ సినిమాకు లేడీ డైరక్టర్ వర్క్ చేస్తున్నా, కంటెంట్ లో హాట్ మాత్రం పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఆగస్ట్ 26న దేశ వ్యాప్తంగా టాక్సిక్ విడుదల అవుతుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss