iDreamPost
android-app
ios-app

దిల్ రాజు మాటలు సరే..!

నిర్మాత దిల్ రాజు స్ట్రయిట్ గా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. మాటలు బాగుంటాయి. అందువల్ల ఆయన ఎప్పుడు మీడియాతో మాట్లాడినా సంచలనంగా వుంటుంది

నిర్మాత దిల్ రాజు స్ట్రయిట్ గా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. మాటలు బాగుంటాయి. అందువల్ల ఆయన ఎప్పుడు మీడియాతో మాట్లాడినా సంచలనంగా వుంటుంది

దిల్ రాజు మాటలు సరే..!

నిర్మాత దిల్ రాజు స్ట్రయిట్ గా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. మాటలు బాగుంటాయి. అందువల్ల ఆయన ఎప్పుడు మీడియాతో మాట్లాడినా సంచలనంగా వుంటుంది. లేటెస్ట్ గా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వూ ఇచ్చారు. సినిమా కలెక్షన్ల పోస్టర్ల గురించి, అవి వేయడం వెనుక వచ్చే వత్తిడి గురించి ప్రస్తావించారు. హీరోలు పోటీ పడి కలెక్షన్ల పోస్టర్లు వేయిస్తారు అని చెప్పారు. ఇంకా చాలా చాలా చెప్పారు. అంత వరకు బాగానే వుంది.

కానీ దిల్ రాజు ఓ మామూలు నిర్మాత కాదు. గిల్డ్ పెద్ద. ప్రభుత్వ పరంగా సినిమాలకు సంబంధించి పెద్ద పదవిలో వున్నారు. టాలీవుడ్ నిర్ణయాలను ప్రభావితం చేయగల స్థాయిలో వున్నారు.

అందువల్ల అలాంటి పెద్ద వ్యక్తి కేవలం మాటలు చెప్పి ఊరుకోకూడాదు. సమస్యలకు పరిష్కారాలు చూడాలి. నిర్మాతలను అందరినీ ఓ తాటి మీదకు తెస్తే హీరోలు దిగి వస్తారు కదా. నిర్మాతలు అంతా ఫేక్ పోస్టర్లు వేయకూడదు అని అధికారికంగా తీర్మానం చేసుకుని నిర్ణయించుకున్న రోజున హీరోలు వత్తిడి చేసే అవకాశం వుంటుందా?

నిర్మాణంలో సగభాగం హీరోల రెమ్యూనిరేషన్లకు వెళ్తోంది. ఈ విషయంలో దిల్ రాజు తలుచుకుంటే నిర్మాతలను చర్చల్లోకి తీసుకురాగలరు. ఇంటర్వూలో ప్రస్తావించిన చాలా విషయాలను దిల్ రాజు గట్టిగా పూనుకుంటే పరిష్కరించగలరు.

కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే నిర్మాతగా ఆయనకు కూడా ఆబ్లిగేషన్లు వుంటాయి. పెద్ద హీరోలతోొ సినిమాలు చేయాలని వుంటుంది. అక్కడ వస్తుంది. రాజీ పడాల్సిన అవసరం.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet